సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్య చేసిన బండి!

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. త్వరలోనే బయటపెడతానని ఆయన తెలిపారు. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ స్పీకర్ పర్మిషన్ ఇస్తే.. తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు చెబుతామని ఆయన బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

అదే జరిగితే కేసీఆర్ బండారం బయటపడుతుందని.. ఆ అంశం పార్లమెంటును కచ్చితంగా కుదిపేస్తుందని అన్నారు. కాకపోతే ఆ విషయం ఏంటో అని ఇప్పుడే దొందర పెట్టవొద్దని.. త్వరలో తానే బయట పెడతా అని అన్నారు. ఇక బండి సంజయ్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెను రంగంలోకి దించడంపై కూడా సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం పీవీ ఘాట్‌ను కూలుస్తామంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అక్షర సినిమా రివ్యూ…!

అనిల్ రావిపూడితో మహేష్ బాబు కొత్త సినిమా

నితిన్ ‘చెక్’ పెట్టలేకపోయాడా?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -