Thursday, April 18, 2024
- Advertisement -

ఏపీలో కాషాయ జెండా ఎగురుతుందా ..?

- Advertisement -

ప్రస్తుతం బీజేపీ పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉంది. నరేంద్ర మోడి, అమిత్ షా వంటి దిగ్గజాల నాయకత్వంలో పార్టీ కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే, చాలా రాష్ట్రాలలో గట్టిగానే ప్రభావం చూపుతోంది. దీనికి ప్రదాన కారణం నరేంద్ర మోడీ మానియా అనే చెప్పవచ్చు. అలాగే అమిత్ షా రాజకీయ చతురత కూడా పార్టీకి ప్రదాన బలం. ఇక పస్తుతం దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడలనే దృఢ నిర్ణయం తో ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీ అధిష్టానం. దీంతో బీజేపీ ప్రభావం లేని రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో సౌత్ రాష్ట్రాలలో పాగా వేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది కాషాయ దళం.

ముఖ్యంగా ఏపీలో బీజేపీ ని బలోపేతం చేసి నెక్స్ట్ రాబోయే సార్వత్రిక ఎన్నికలల్లో.. వైసీపీ, టీడీపీ, జనసేన వంటి పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ కాషాయ జండా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే సిద్దమైంది కాషాయదళం. అందులో బాగంగానే వరుసగా కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించడం మనం చూస్తున్నాం. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఏపీలో పర్యటించారు. ఇక ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో మోడీ పాలన గురించి ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ బీజేపీ ని బలోపేతం చేసేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నించారు.

ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ ఇప్పటినుంచే ముమ్మర కసరత్తులు చేస్తోంది. రాబోయే రోజుల్లో మోడీ, అమిత్ షా వంటి వారు కూడా ఏపీ లో పర్యటించిన ఆశ్చర్యం లేదు. అయితే బీజేపీ పరిస్థితి ఏపీలో అంతంత మాత్రంగానే ఉంది. వైసీపీ, టీడీపీ, జనసేన వంటి పార్టీలను దాటుకొని బీజేపీ అధికారం చేపట్టడం కలలో కూడా జరగని పని. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి పొత్తులతో రంగంలోకి దిగేందుకు గట్టి ప్రయత్నలే చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బీజేపీ ప్రస్తుతం ఏపీలో పాగా వేసేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

Also Read

1.ఇక చంద్రబాబు పనైపోయిందా ?

2.పవన్ పగటి కల నెరవేరుతుందా ?

3.టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -