Friday, March 29, 2024
- Advertisement -

పవన్ పగటి కల నెరవేరుతుందా ?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఒక్క క్లారిటీ లేని పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ స్థాపించి పదేళ్ళు గడిచిన ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో అశేష అభిమానఘనం ఉన్న పవన్ కల్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి దారుణంగా ఓటిమి పలు అయిన సంగతి విధితమే. పార్టీ అధినేతగా ఉండి పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయిన నేత ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కల్యాణ్ మాత్రమే అని చెప్పక తప్పదు. రాజకీయ చరిత్రలోనే ఇంతటి ఘోరమైన రికార్డ్ కలిగిన జనసేనాని ఇప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

అసలు జనసేన పార్టీ అంటేనే అస్థిరత్వ నిర్ణయాలకు కేంద్రం అని భావిస్తున్న ప్రజల వైఖరిని మార్చేందుకు పవన్ ఇప్పటికీ కూడా ప్రయత్నించక పోవడం నిజంగా విడ్డూరమే. కానీ ఒకప్పుడు పదవులపై ఆశలేదన్న జనసేనాని ప్రస్తుతం సి‌ఎం పదవే టార్గెట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు.. మరి సి‌ఎం పదవి టార్గెట్ అయినప్పుడు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతూ, గ్రామ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు ప్రజల్లో జనసేన పార్టీ పేరు బలంగా వినిపించేలా చెయ్యాలి కానీ ఆదిశగా పవన్ ఇప్పటికీ కూడా ప్రయత్నించడం లేదు.

అయితే పొత్తుల విషయంలో కూడా ప్రస్తుతం ఆచి తూచి అడుగులేస్తున్న పవన్ ఎన్నికల సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ప్రశ్నార్థకమే..! ఒకవేళ టిడిపి, బి‌జే‌పి వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పటికి పవన్ ఆశిస్తున్న సి‌ఎం పదవి దక్కే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ను మించిన హేమాహేమీలు సి‌ఎం కుర్చీ కోసం ముందు వరుసలో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో పవన్ ఆశిస్తున్న సి‌ఎం కుర్చీ దక్కడం.. పగటికలే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

అసలైన పొలిటీషియన్ .. బూతులే వీరి క్వాలిఫికేషన్ !

జూమ్ మీటింగ్ : ర్యాగింగా.. రాజకీయమా ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -