Monday, May 6, 2024
- Advertisement -

చంద్ర‌బాబు కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారా…? ఆ ప‌ని చేస్తారా…?

- Advertisement -
             

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమితో జట్టు కట్టి టీడీపీ బరిలో దిగింది. ఫ‌లితాలు ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఫలితాలపై తెలంగాణతోపాటూ, ఏపీ ప్రజలు కూడా ఆసక్తి కనబరిచారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిపోవడంతో… ఇక పార్టీల ఫోకస్, ప్రజల ఆసక్తి అంతా ఆంధ్రప్రదేశ్‌వైపు మళ్లింది.

తెలంగాణాలో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా సార్వత్రిక ఎన్నిక‌ల హ‌డావుడీ మొద‌ల‌య్యింది. అన్ని పార్టీలు అసెంబ్లీ, లోక్ స‌భ‌ గెలుపు గుర్రాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. 2014లో ఏప్రిల్‌లో ఎన్నికలు జరగగా, ఈసారి మరో 10 రోజులు ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ సంకేతాలివ్వడంతో పార్టీలలో కలకలం మొదలైంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైసీపీ, టీడీపీలు అభ్య‌ర్తుల ఎంపిక‌లో దూసుకుపోతున్నాయి. ఇక జ‌న‌సేన మాత్రం ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించినా ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు మాత్రం సాగ‌డంలేదు.అయితే అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న‌పైనే ముల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. తెలంగాణాలో లాగా ముఖ్యంగా ప్రజాకూటమి లాగా ఆలస్యంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే, అట్టర్‌ఫ్లాప్ అవుతామని ఏపీలో పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ముందుగానే అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

టీడీపీ వీలైనంత త్వ‌ర‌గా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చెయ్యాలనుకుంటోంది. టెక్నాలజీని వాడుకోవడం, సర్వేలు చేయించుకోవడంలో టీడీపీది ప్రత్యేక ట్రాక్ రికార్డ్ ఉంది.తెలంగాణలో సీఎం కేసీఆర్ అద్భుత మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావడంతో, ఏపీలో తాము కూడా సత్తా చాటాలని అధికార టీడీపీ ఆశిస్తోంది. అందుకోసం ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు సర్వేలను తెప్పించుకొని సమీక్షించారు. ముందుగానే అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని పార్టీ శ్రేణుల‌కు సంకేతాలిచ్చారు బాబు.

సర్వేల రిపోర్టులతోపాటూ పార్టీ ఇన్‌ఛార్జులతోనూ చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో కనీసం 30 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే, పార్టీలో అంతర్గతంగా తిరుగుబాటు తప్పదు. ఆ పరిస్థితి తలెత్తకుండా అసంతృప్తులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి సైలెంటయ్యేలా చేస్తారని తెలుస్తోంది.

అయితే బాబు వ్యాఖ్య‌లు న‌మ్మ‌శ‌క్యంగాలేవ‌ని పార్టీ నేత‌లు అంటున్నారు. అభ్య‌ర్తుల ఎంపిక‌లో బాబు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అంద‌రికీ తెల‌సిందే. ఎవ్వ‌రికీ టికెట్ ఇవ్వ‌కుండా అద‌రినీ అభ‌ద్ర‌తా భావంలో పెట్ట‌డం అల‌వాటే.

బాబు కేబినెట్లోని మంత్రుల్లో కూడా ఈ డౌట్లున్నాయి. చిన్న రాజప్పకు ఆ సీటు దక్కుతుందో లేదో తెలీదు. అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డితో థ్రెట్ పెట్టాడు. బామ్మర్ది బాలయ్యను అయినా హిందూపురం నుంచినే పోటీ చేయిస్తాడా అనేది సందేహంగా ఉంది.

మ‌రో వైపు కొడుకు లేకేష్ సీటు విష‌యంలో బాబు ముళ్ల‌గ‌ల్లాలు ప‌డుతున్నారు. ఇక నలభైమంది సిట్టింగులను మారుస్తారనే ప్రచారం మొదటి నుంచి జ‌రుగుతోంది. ఇంతలొల్లి ఉంది తెలుగుదేశం పార్టీలో. పాతవాళ్లు, ఫిరాయింపుదారులు, కొత్త ఆశావహులు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్లు.. ఇలా రకరకాల కేటగిరిల్లో నేతల మధ్య లొల్లి సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆసక్తిదాయకంగా ఉంది. కేసీఆర్‌లాగా ధైర్యం చేస్తారా లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -