Saturday, May 4, 2024
- Advertisement -

షర్మిలతో బీజేపీ దోస్తీ కోరుకుంతోందా ?

- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం శర్మిల చుట్టూ కొనసాగుతున్న రాజకీయం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటెందుకు వైఎస్ షర్మిల గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పాదయాత్ర చేపట్టి తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరవుతూ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇక టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా ఆమె ఈ మద్యకాలంలో చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల నర్సింపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. దాంతో టి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు, ఆమె బస్సును తగలబెట్టి, కారును కూడా ధ్వంసం చేసిన సంగతి విధితమే.

ఇదిలా ఉండగా హైదరబాద్ లో కూడా షర్మిల చుట్టూ కొనసాగిన ఉద్రికత నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. షర్మిల అరెస్ట్ కు నిరాకరించడం, ఆమెను కారుతో పాటు క్రేన్ ల సహాయంతో పోలీసులు పిఎస్ కు వంటి ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం షర్మిలపై కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందని, ఓ రాజకీయ నేతను క్రేన్ లతో పోలీస్ స్టేషన్ కు తరలించడం దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదని రాజకీయ వాదాలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా శర్మిలాపై కే‌సి‌ఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బిజెపి తీవ్ర స్థాయిలో మండి పడింది.

ఒక ఆడబిడ్డపై అరెస్టులకు పాల్పడుతూ, కక్ష రాజకీయాలు చేయడం సరికాదని బిజెపి నేతలు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే బీజేపీ షర్మిల వ్యవహారంపై స్పందించడంతో వైతెపా, భాజపా లు కలిసి పనిచేస్తున్నాయని టి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ల లో ” తాము వదిలిన బాణం.. తానా అంటే తందాన అంటున్న తామర పువ్వులు ” అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. దీంతో జీజెపి వైతెపా మద్య రహస్య బంధం ఉందనే విషయాన్ని టి‌ఆర్‌ఎస్ శ్రేణులు బలంగా చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ షర్మిలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఏదీ ఏమైనప్పటికి ప్రస్తుతం తెలంగాణలో షర్మిల చుట్టూ తిరుగుతోన్న రాజకీయం ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

జగన్ ప్రభుత్వానికి ఎసరు పెట్టిన ఉద్యోగులు !

కే‌సి‌ఆర్ రహస్య వ్యూహం.. అదే అంటున్న బీజేపీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -