Sunday, April 28, 2024
- Advertisement -

“బటన్ నొక్కుడు “.. ఇదేం పాలనరయ్యా !

- Advertisement -

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నాడనేది ఎవరు కాదనలేని వాస్తవం. అయితే రాష్ట్రాన్ని ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే అభివృద్ది పథంలో నడిపించలేవని, రాష్ట్రనికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అన్నీ రంగాల్లోనూ ముందుకు సాగుతుందనేది కొందరి వాదన. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడం, వివిద రంగాలకు ప్రాధాన్యత కల్పించడం వంటివి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నప్పటికి వ్యతిరేకత కూడా వ్యక్తమౌతోంది. ఇక సంక్షేమ పథకాల విషయంలో పారదర్శికంగా అమలు చేస్తున్నామని, తాను బటన్ నొక్కడంతో పథకాలకు సంబంధించిన నగదు నేరుగా లభ్దిదారుడి అకౌంట్ లో పడుతోందని ఎలాంటి అవకతవకలకు తావే లేదంటూ జగన్ పదే పదే చెబుతున్నారు.

అయితే బటన్ నొక్కడంతోనే అభివృద్ది జరుగుతోందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత కరెంటు కోతలు, కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, డీజిల్ పెట్రోల్ ధరల మోతలు, సరికొత్తగా చెత్తపై కూడా పన్ను.. ఇసుకపై సరికొత్త విధానం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు అవసరం అయ్యే ప్రతి దానిపై కూడా భారీగా ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందనేది విపక్షాల వాదన,. బటన్ నొక్కుతూ ప్రజలకు పంచుతున్నది కొంతే అయితే పన్నుల ద్వారా దోచుకుంటున్నది చాలా ఎక్కువ అనే విమర్శలు జగన్ ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి. ఇక ఈ బటన్ నోక్కే కార్యక్రమంపై జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మదనేపల్లిలో నివహించిన బహిరంగ సభలో బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన కు సంబంధించిన నగదు పంపిణి చేశారు సి‌ఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో బటన్ నోక్కే వాళ్ళు లేరని, రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే రీతిలో సాగిందని ” వ్యాఖ్యానించారు. తను బటన్ నొక్కి మంచి పనులు చేస్తే ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, పథకాలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని సి‌ఎం జగన్ చెప్పుకొచ్చారు. తాను బటన్ నొక్కడం వల్ల ఏపీ మరో శ్రీలంక అవుతుందని ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తున్నాయని, తాను చేసే మంచి పనులను చూస్తి ఓర్వలేక పోతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అయితే సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుడు తప్పా రాష్ట్రానికి ఇంకేం చేసింది లేదని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

షర్మిలతో బీజేపీ దోస్తీ కోరుకుంతోందా ?

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

కే‌సి‌ఆర్ రహస్య వ్యూహం.. అదే అంటున్న బీజేపీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -