- Advertisement -

కుట్రదారు బాబే..ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టు!

- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ముందున్న దారులన్నీ క్లోజ్ అయ్యాయి. కొన్ని గంటల పాటు చంద్రబాబును విచారించింది న్యాయస్థానం. సుదీర్ఘ విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో 28 పేజీల రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు సమర్పించారు.

ఈ రిపోర్టులో స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌ జరిగిన తీరును క్షణ్ణంగా పేర్కొన్నారు సీఐడీ అధికారులు. కుట్రకు సూత్రధారి చంద్రబాబేనని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. ఒకవేళ బెయిల్ దొరకని పక్షంలో బాబుకు శ్రీకృష్ణ జన్మస్ధానం తప్పదు.

చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా,సీఐడీ తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తుండగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇక రిమాండ్ రిపోర్టులో 2021 ఎఫ్ఐఆర్‌ లేదని చెబుతూనే తాజాగా చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టు ఇచ్చారు అధికారులు.అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ఏ1 ప్రధాన నిందితుడిగా మార్చామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -