Saturday, May 4, 2024
- Advertisement -

జనసేనతో పొత్తు.. చంద్రబాబు ఎత్తు !

- Advertisement -

అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు ను చీలనివ్వబోమని, అందుకోసం పొత్తులకు కూడా తాము సిద్దమే అని పవన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. దాంతో గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన పొత్తుపై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. ఆ మద్య విశాఖా ఘటన తరువాత పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో ఈ రెండు పార్టీల పొత్తుపై మరింతగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల పొత్తుల విషయంలో అటు పవన్ గాని, ఇటు చంద్రబాబు గాని స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. .

అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ రెండు పార్టీల పొత్తును పదే పదే కన్ఫర్మ్ చేస్తున్నారు. చంద్రబాబు పవన్ మద్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, పవన్ చంద్రబాబు దత్త పుత్రుడని ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల చంద్రబాబు పర్యటనలో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నా సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ నాయకుల పర్యటనలపై జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది. అంతటితో ఆగకుండా జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చి చంద్రబాబు, పవన్ కు మరింత షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. అయితే జీవో నెంబర్ ఒన్ కేవలం కక్ష పూరితంగానే ప్రవేశ పెట్టారని వైఎస్ జగన్ పై చంద్రబాబు, పవన్ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

ఇలా రాజకీయ రగడ కొనసాగుతున్నవేళ తాజాగా చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. విశాఖా ఘటన తరువాత పవన్ తో చంద్రబాబు భేటీ అయితే.. ఇప్పుడు తాజా పరిణామాలతో పవన్ చంద్రబాబును కలిశారు. దీంతో వీరి కలయిక మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఈసారి పొత్తు విషయంలో ఇద్దరు బహిర్గతం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.. అయితే పొత్తు విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని, కేవలం జీవో నెంబర్ ఒన్ పైనే చర్చించమని పవన్ బేటీ అనంతరం చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు మాత్రం ఇంకోలా స్పందించారు.. ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటాం. 2009 లో బి‌ఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకున్నాం.. తర్వాత ఆ పార్టీతో విభేధించాం. రాజకీయల్లో పొత్తులు సహజం. పొత్తులపై ఇప్పుడు మాట్లాడడం సరికాదని, ఎప్పుడు ఏం చేయాలో తమకు వ్యూహాలు ఉంటాయని, సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాం ” అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే జనసేనతో పొత్తు కన్ఫర్మ్ గా ఉంటుందనే వాదన రాజకీయవాదుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు అనే దానిపైనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. మరి చూడాలి టీడీపీ, జనసేన పొత్తు రాష్ట్ర రాజకీయల్లో ఎలాంటి పరిణామాలకు చోటిస్తుందో మరి.

ఇవి కూడా చదవండి

బిజేపీ యాక్షన్ ప్లాన్.. 10వేల కిలోమీటర్లు !

ఎన్నికల బరిలో జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు వ్యూహం అదే !

పవన్ చూపు అటువైపే.. హింట్ ఇచ్చాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -