Friday, May 3, 2024
- Advertisement -

జాతీయ పార్టీకి ముందు కే‌సి‌ఆర్ ప్లాన్ ఇదే ?

- Advertisement -

ప్రస్తుతం కే‌సి‌ఆర్ ఫోకస్ అంతా కూడా దేశ రాజకీయాలపైనే ఉంది. ఆయన ప్రస్తుతం వేస్తున్న ప్రణాళికలు, వ్యూహాలు అన్నీ కూడా జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొనే రచిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో పర్యటించిన కే‌సి‌ఆర్.. జాతీయ మీడియాలో గట్టిగానే ఫోకస్ అయ్యారు. ఇక త్వరలోనే జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్న కే‌సి‌ఆర్.. ఆ పార్టీ నిత్యం ప్రజల్లో ప్రస్తావన వచ్చే విధంగా కే‌సి‌ఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం పబ్లిసిటీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టరాట. పార్టీ ప్రకటన తరువాత నిత్యం పార్టీ పేరు నేషనల్ మీడియాలో నానే విధంగా ఆయా మీడియా సంస్థలతో కే‌సి‌ఆర్ టీం మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలో అమలౌతున్న ఉచిత విద్యుత్, రైతు బందు వంటి పథకాలను చూపిస్తూ తెలంగాణ మోడల్ అంటూ జాతీయ మీడియాల్లో హైలెట్ అయ్యేందుకు ఆన్ని విధాలుగా కే‌సి‌ఆర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇక కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ ప్రకటన దసరా సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికి.. ఆ వార్తలపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. గత కొంత కాలంగా కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ పేరు ” భారత రాష్ట్ర సమితి ” అని గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను అటు కే‌సి‌ఆర్ గాని, టి‌ఆర్‌ఎస్ శ్రేణులు గాని ఖండించక పోవడంతో కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ పేరు బి‌ఆర్‌ఎస్ అని అందరూ భావించారు.

అయితే ఈ పేరు పై కే‌సి‌ఆర్ పునఃఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి పేరులో ప్రాంతీయత ఉట్టిపడుతోందని.. ఇది జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు కే‌సి‌ఆర్ కు సూచించరాట. దాంతో ” భారత రాష్ట్ర సమితి ” పేరుకు బదులుగా ” భారత వికాస్ సమితి ” పేరును కే‌సి‌ఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరునే తాను పెట్టబోయే జాతీయ పార్టీకి దాదాపుగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందట. మరి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కే‌సి‌ఆర్ వేస్తున్న ఈ నయా ప్లాన్స్ ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.

Also Read

గ్రామ సచివాలయను రద్దు చేస్తారా ?

యాక్టర్ vs మాస్ లీడర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -