Friday, March 29, 2024
- Advertisement -

కేసిఆర్ దుబ్బాక లో ఈ రేంజ్ లో ప్లాన్ చేశారా..?

- Advertisement -

దుబ్బాక లో సమర శంఖం మోగిన దగ్గరినుండి తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది చెప్పాలి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలని ఇప్పటినుంచే తమ అస్త్రాలకు పదును పెడుతూ ముందుకు వెళుతుంది.. ఇక బీజేపీ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లు అధికార పార్టీ పై కారాలు మిర్యాలు నూరుతుంది.. ఇక్కడ తామే గెలుస్తామని చెప్తూ అందరిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.. ఇక అధికార పార్టీ విషయానికొస్తే  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం గా మారింది.

సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే కాకుండా, ముఖ్మమంత్రి సొంత జిల్లా కావడం కూడా ఆ పార్టీకి గెలుపు ఖచ్చితంగా అవసరం. అందులోనూ కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిందని వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అధికార పార్టీ కి చాల ముఖ్యమైంది. ఇక రామలింగారెడ్డి మరణం తర్వాత నుంచే అక్కడ టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించింది అని చెప్పొచ్చు..  ఈ ఎన్నికల్లో సింపతీ ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తుండగా ఆ సింపతీ తోనే గెలిచి తీరాలని డిసైడ్ అయ్యింది..

ఇక నవంబరు 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే త్రిముఖ పోటీ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుది.. టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని గ్రామాల్లో బాధ్యులను నియమించి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. ఇక మంత్రి హరీశ్ రావు అయితే పూర్తిగా దుబ్బాకలోనే ఉంటున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే మరో సిద్ధిపేట చేస్తానని హరీశ్ రావు పదే పదే చెబుతున్నారు. ఇక త్వరలో మంత్రులకు కూడా మండలాల వారీగా బాధ్యతలను అప్పగించనుంది టీఆర్ఎస్ అధిష్టానం. అయితే టీఆర్ఎస్ ఇక్కడ మాములు గెలుపుకోసమైతే ఇక్కడ కోరుకోవట్లేదట. భారీ మెజారిటీ తో గెలిస్తేనే ఇక్కడ గెలుపుకు అర్థం అని కేసీఆర్ హరీష్ రావు కి చెప్పారట. మరి హరీష్ రావు కేసీఆర్ నమ్మకాన్ని ఎలా నిలబెడతాడో చూడాలి..

తెలంగాణ లో కేసీఆర్ మాటే నెగ్గుతుందా..?

ఉత్తమ్ పోస్ట్ ఊడుతుందా.. కాంగ్రెస్ నేతలే చెప్తున్నారుగా.?

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

దుబ్బాక లో హరీష్ టీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగించేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -