Tuesday, May 7, 2024
- Advertisement -

2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే మళ్లీ చంద్రబాబే సీఎం….

- Advertisement -

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఏం మాట్లాడినా సంచ‌ల‌నంగా మారుతుంది. రాజ‌కీయాల్లో చురుగ్గాలేక‌పోయినా ప్ర‌భుత్వంపై పోరాడుతూనె ఉంటారు. ఏది మాట్లాడినా లాజిక్‌గా మాట్లాడ‌తారు. ఇప్పుడాయన ఏ పార్టీలో లేకపోయినా పలు సమస్యలపై అడపాదడపా మీడియా ముందుకొస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబును ప్ర‌శంశిస్తూనె వైసీపీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా పోల‌వ‌రం ప్రాజెక్టుమీద‌నె త‌రుచూ స్పందిస్తుంటారు. పోలవరం కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని, ఆ కాంట్రాక్టర్ ను మార్చితేకానీ అది ముందుకెళ్లదని చాలా సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఉండవల్లి అన్నారు. ఇప్పుడు బాబు క‌ల్లు తెర‌వార‌ని అన్నారు. ప్రభుత్వం తాజాగా 60సి కింద కాంట్రాక్టర్ కు నోటీసు ఇచ్చిందన్నారు. వెంటనే సత్తా ఉన్న కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని ఉండవల్లి జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు పోలవరంపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికే అది పూర్తయి ఉండేదన్నారు. పోల‌వ‌రంను కేంద్రానికి వ‌దిలి పెట్ట‌కుండా మేమే పూర్తి చేస్తామ‌ని ….రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ప‌నిలో ప‌నిగా నంద్యాల ఉప ఎన్నిక‌పై స్పందించారు. ఉపఎన్నికలకు ముందు నంద్యాల డ్వాక్రా సంఘాలకు 4వేల వంతున ప్రభుత్వం జమ చేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కోడ్ అమల్లో ఉండగా ఒక్క నంద్యాలలోనే జమ చేయవచ్చా.. అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ప్రజల్లో మద్దతు ఉందని అనుకుంటున్నారని.. అయితే వారిది ఒట్టి భ్రమేనని ఉండవల్లి అన్నారు. మ‌రి ఉండ‌వ‌ల్లి చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ వ్రేణులు ఏమంటారొ చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -