Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్ తో దోస్తీ.. బి‌ఆర్‌ఎస్ సై అంటుందా ?

- Advertisement -

తెలంగాణలో వచ్చే ఎన్నికలతో హంగ్ ప్రభుత్వం ఏర్పడబోతుందా ? అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీతో కాంగ్రెస్ దోస్తీ కట్టబోతుందా ? కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి ? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హీట్ ను పెంచుతున్నాయి. ఎదుకంటే ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యాలే ఇందుకు కారణం.. వచ్చే ఎన్నికల్లో ఏపార్టీ కి పూర్తి మెజారిటీ రాదని, కాంగ్రెస్ 60 స్థానాల్లో గెలుస్తుందని, బి‌ఆర్‌ఎస్ కాంగ్రెస్ కలిసి వచ్చేసరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని, బి‌ఆర్‌ఎస్ కు కాంగ్రెస్ తో కలవడం తప్పా వేరే దిక్కు లేదని.. ఇలా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

దీంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అంటే బి‌ఆర్‌ఎస్ పార్టీనే.. అలాంటి ప్రత్యర్థి పార్టీతో తాము కలుస్తామని కోమటిరెడ్డి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని హస్తం నేతలు చెబుతున్నారు. కోమటిరెడ్డి పార్టీలో కల్లోలం సృష్టించే వ్యాఖ్యలు చేయరాదని హస్తం నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలోచింపజేసే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు బలం పెంచుకున్నాయి.

ముఖ్యంగా బీజేపీ చపాకింద నీరులా విస్తరిస్తోంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లోనూ అలాగే హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార బి‌ఆర్‌ఎస్ కు గట్టిగానే షాక్ ఇచ్చింది బీజేపీ. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు బీజేపీ గట్టిగానే పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం రాకపోతే కచ్చితంగా ఏదో ఒక పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. దాంతో బి‌ఆర్‌ఎస్ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ తో కలవడం. ఇదే విషయాన్నే కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ నిజంగానే బి‌ఆర్‌ఎస్ కాంగ్రెస్ తో కలిస్తే.. కాంగ్రెస్ కే అధిక లాభం చేకూరుతుందని విశ్లేషకుల అంచనా. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో కీలక పదవుల కోసం హస్తం నేతలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే బి‌ఆర్‌ఎస్, పొత్తు విషయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై గులాబీ నేతల నుంచి పెద్దగా వ్యతిరేక స్వరం వినబడక పోవడంతో బి‌ఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్ తో కలిసే ఆలోచనలో ఉందా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ బి‌ఆర్‌ఎస్ దోస్తీ రాజకీయం కొత్త చర్చలకు తావిస్తోంది.

Also Read

ఈటెల విషయంలో.. కే‌సి‌ఆర్ వ్యూహం ఆదేనా ?

తెలంగాణ మోడల్.. దేశంలో సాధ్యమా ?

రిషికొండ గ్రీన్ మ్యాట్.. జగన్ గ్రాఫిక్స్ గురూ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -