Sunday, April 28, 2024
- Advertisement -

ఈటెల విషయంలో.. కే‌సి‌ఆర్ వ్యూహం ఆదేనా ?

- Advertisement -

ఒకప్పుడు టి‌ఆర్‌ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేంద్ర.. ఆ తరువాత పార్టీలోని అంతర్గత కారణాల వల్ల టి‌ఆర్‌ఎస్ వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాషాయ పార్టీలో చేరిన తరువాత కూడా అధికార టి‌ఆర్‌ఎస్ కు షాక్ ఇస్తూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి బలం చేకూర్చారు. ఇక ప్రస్తుతం బీజేపీలో చేరికల కమిటీ చైర్మెన్ గా ఉన్న ఈటెల.. మళ్ళీ సొంత గూటి వియపు చూస్తున్నారా అనే వార్తలు గత కొద్ది రోజులుగా పోలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెలకు పార్టీలో సరైన ప్రదాన్యత లభించడం లేదని, పార్టీ అధిష్టానం తీరుపై ఈటెల అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. .

దీంతో ఆయన తిరిగి బి‌ఆర్‌ఎస్ గూటికి చేరుకుంటారనే వార్తలు జోరుగా వినిపిస్తూ వచ్చాయి. ఇదిలా ఉంచితే ఈటెల విషయంలో కే‌సి‌ఆర్ తో పాటు ఇతర బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆ మద్య కే‌టి‌ఆర్ మరియు ఈటెల మద్య జరిగిన సంభాషణ ఏ స్థాయిలో వైరల్ అయిందో అందరం చూశాం. ఇక సి‌ఎం కే‌సి‌ఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలలో ఈటెల రాజేందర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు. రాష్ట్ర పథకాల రూపకల్పనలో ఈటెల సహకారం ఎంతో అభినందనీయం అని.. మంత్రులు కూడా ఈటెల సలహాలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈటెల ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారా ? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే కే‌సి‌ఆర్ తన పేరును ప్రస్తావించడంపై ఈటెల రాజేదర్ ఇంకోలా స్పందించారు..

కే‌సి‌ఆర్ తన వ్యూహంలో భాగంగానే తన పేరు ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీజేపీలో సైనికుడిల పని చేస్తున్నానని, గతంలో ఉన్న పార్టీలో కూడా తను సైనికుడిలాగే పని చేశానని ఈటెల అన్నారు. తనది పార్టీ మారే సంస్కృతి కాదని, తాననే గతంలో పార్టీ నుంచి గెంటేశారని, తిరిగి ఆ పార్టీలో చేరే ఆలోచనే లేదని ఈటెల స్పష్టం చేశారు. అయితే ఈటెల ను తిరిగి పార్టీలో కలుపుకునేందుకు కే‌సి‌ఆర్ ఇప్పుడేందుకు ప్రయత్నిస్తున్నారనేదే హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ యొక్క బలాబలహీనతలు బాగా తెలిసిన ఈటెల రాజేంద్ర ప్రత్యర్థి పార్టీలో ఉండడం వల్ల వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని భావించే కే‌సి‌ఆర్ ఈటెలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు దారులు వేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వ్యూహాలను రచించడంలోనూ వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయడంలోనూ కే‌సి‌ఆర్ కు అందె వేసిన చేయి.. మరి ఈటెల విషయంలో కే‌సి‌ఆర్ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read: ఒకే రాజధానా.. మూడు రాజధానులా ఏంటి ఈ కన్ఫ్యూజన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -