Friday, April 26, 2024
- Advertisement -

కోమటిరెడ్డిపై హైకమాండ్​ సీరియస్​.. చర్యలు తీసుకుంటుందా?

- Advertisement -

రేవంత్​రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో కాంగ్రెస్​ పార్టీలో అసంతృప్తులు మొదలైన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. ఇక పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్​గా ఉన్న మర్రి శశిధర్​రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యవహారాలా ఇంచార్జి మాణిక్కం ఠాగూర్​ పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటులా.. నోటుకు పీసీసీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని.. గాంధీ భవన్​ను టీటీడీపీ భవన్​లా మార్చేశారని.. ఎంతో కాలంగా పార్టీలో ఉన్న వారికి గుర్తింపు ఇవ్వకుండా .. పార్టీ మారిన వారికే పదవులు దక్కాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కోమటిరెడ్డి సోదరులకు పీసీసీ లో ఎటువంటి పదవులు దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్​ అధిష్ఠానం పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్​ మెట్లు ఎక్కబోనని స్పష్టం చేశారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్​ అయినట్టు సమాచారం.

కోమటిరెడ్డి మాట్లాడిన విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలని ఏఐసీసీ ప్రోగ్రామ్స్​ ఇంప్లిమెంట్​ కమిటీని హైకమాండ్​ ఆదేశించిందట. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను ఇంగ్లిష్​ లో అనువదించి పంపించాలని సూచించదంట. అయితే కోమటిరెడ్డి ఆవేశంలో మాట్లాడిఉంటారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆయన పదవిని ఆశించారని.. సహజంగానే కొంత అసంతృప్తితో మాట్లాడి ఉండొచ్చని వారు అంటున్నారు.మరోవైపు రేవంత్​ అనుచరులు సైతం కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పెద్దగా ప్రతిస్పందించలేదు. ఈ క్రమంలో అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Also Read

కాంగ్రెస్​ను అధికారంలోకి తెస్తా..!

టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా సునీతా రావు.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -