Monday, April 29, 2024
- Advertisement -

టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా సునీతా రావు.. !

- Advertisement -

కాంగ్రెస్​ మార్కు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ పదవుల నియామకం అంత తొందరగా తెమలదు. అధిష్ఠానం అన్ని లెక్కలు వేసుకొని ఓ వ్యక్తిని నియమిస్తుంది. అందుకు నెలలు కాదు.. ఏళ్లు కూడా పట్టొచ్చు. అందుకు ఉదాహరణగా టీపీసీసీ నియామకాన్నే చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరమే తాను పదవు నుంచి తప్పుకోబోతున్నట్టు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ ఆయన్నే కొనసాగిస్తున్నారు తప్ప.. ఆ స్థానాన్ని భర్తీ చేయడం లేదు.

ఇక కాంగ్రెస్​ అధిష్ఠానం తీరుతో ఆ పార్టీ కార్యకర్తలే విసిగిపోయారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అసంతృప్తులను బుజ్జగించలేక ఆ పార్టీ సతమవుతోంది. ఇదిలా ఉంటే టీపీసీసీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న నేరెళ్ల శారద.. ప్రస్తుతం సైలెంట్​గా ఉన్నారు. దీంతో పీసీసీ మహిళా అధ్యక్షురాలిని నియమించాలన్న డిమాండ్​ వచ్చింది. ఈ క్రమంలో ఈ పదవి కోసం సునీతా రావును ఎంపిక చేసింది అధిష్ఠానం.

ఈ పదవికోసం తెలంగాణకు చెందిన నలుగురు మహిళా నేతల పేర్లను పరిశీలించారు. చివరకు జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్‌ సునీతారావును ఎంపిక చేశారు. సునీతారావు గతంలో టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఎన్​ఎస్​యూఐ, యూత్​ కాంగ్రెస్​లోనూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె న్యాయవాదిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్​ హైకమాండ్​ సునీతారావును ఎంపిక చేసింది. ఇక టీపీసీసీ అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారో? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Also Read

తెలుగు ప్రజలంటే ఎంతో అభిమానం.. సేవ చేయాలనుకుంటున్నా : ఎంపీ, సినీనటి నవనీత్‌కౌర్‌

హుజూరాబాద్ లో ‘దుబ్బాక’ సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -