టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో..

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ హరిష్ శంకర్ కాంబినేషన్ భారీ మాస్ మూవీ తెరకెక్కబోతోందని టాలీవుడ్ టాక్. అన్ని కమర్షియల్ హంగులతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారట. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్ ప్రేక్షకాదరణ అందుకోలేకపోయింది. దాంతో తాను చేసే నెక్స్ మూవీతో మరో హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రామ్ ప్రస్తతం అతడు ది వారియర్ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు.

కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి , అక్షర గౌడ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి, నదియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక హరీష్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ తర్వాత హరీష్ , రామ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

జాతీయ భాష పై కొత్త రచ్చకు తెరతీసేలా కంగనా కామెంట్స్

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -