Friday, April 19, 2024
- Advertisement -

జగన్ సర్కార్ కీలక నిర్ణయం : ఇంటికే ఐసోలేషన్ కిట్

- Advertisement -

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ గా తెలి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఇంటి వద్దకే ఐసోలేషన్ కిట్ ను సప్లై చేయాలని నిర్ణయించింది. రోగికి అవసరమైన మెడిసిన్ యాంటిబైటిక్స్, శానిటైజర్స్, మాస్కులు ఇందులో ఉండనున్నాయి. నిన్న ఆరోగ్య కార్యలయంలో ఉన్నత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి తీవ్రత అంతగా లేని వారిని హోమ్ ఐసోలేషన్ కి రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతంది. ఆ పేషెంట్లు బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వారికి అవసరమైన మెడిసిన్ అన్నింటిని ప్రభుత్వం ఇంటివద్దకే చేర్చాలని నిర్ణయించింది. రెండు వారలకు అవసరమయ్యే మెడిసిన్ ను ఈ కిట్ ద్వారా అందించనుంది.

హోమ్ ఐసోలేషన్ లో ఉన్నావారికి వీలైనంత త్వరగా కిట్లను సప్లే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఎవరికైనా పాజిటివ్ నిర్దరణ అయితే వెంటనే సమీప హాస్పటల్ నుంచి బాధితుడి ఇంటికి కిట్ ను సప్లై చేయాలని చెప్పారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువమంది కరోనా బాధితులు ఉంటే వారందరికి కిట్స్ అందజేయాలని చెప్పాలి. అలాగే ప్రతిరోజు వైద్య సిబ్బంది కరోనా పేషెంట్ తో మాట్లాడడం తప్పనిసరి.

ప్యారసిటమల్, హైడ్రోక్లోరిక్ శానిటైజర్లు, మాస్కులు, బ్లౌజులు యాంటీబయాటిక్స్ విటమిన్ సి, విటమిన్ ఇ విటమిన్ డి, ఏసిడిటీ మెడిసిన్ ఈ కిట్ ద్వారా అందించనున్నారు. అలాగే హో ఐసోలేషన్ లో ఉన్న వారిని ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలు కూడా తెలియజేయాలని అధికారులను అదేశించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

జగన్ ను తక్కువ అంచనా వేసిన సోనీయా గాంధీ..!

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని రాజీనామా ?

జగన్ నిర్ణయం.. విడుదల రజినికి గుడ్ న్యూస్..?

చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయిన ఎంపీ విజయసాయి రెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -