Friday, March 29, 2024
- Advertisement -

జగన్ సర్కార్ : హామీలివ్వడం ఎందుకు ?.. సాకులు చెప్పడం ఎందుకు ?

- Advertisement -

జగన్ సర్కార్ ఏపీ లో అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పైనే అవుతోంది. అయితే అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్నికల ముందు వైఎస్ జగన్ లెక్కకు మించి హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారం చేపట్టిన తరువాత వాటిలో కొన్ని ఇప్పటికే నెరవేచ్చినప్పటికి.. ఇంకా ఎన్నో హామీలను వైఎస్ జగన్ పక్కన పెట్టారు. ముఖ్యంగా తమ ప్రభుత్వంలో సంపూర్ణ మద్యపాన నిషేదం ఖాయమని నొక్కి చెప్పిన జగన్ సర్కార్.. అధికారం చేపట్టిన తరువాత మద్యపాన నిషేదంపై మొదట్లో కాస్త హడావిడి చేసినప్పటికీ.. ఆ తరువాత మద్యపాన నిషేదంపై నోరు మెదపలేదు. ఇక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ హామీ తమ మానిఫెస్టో లోనే లేదంటూ జగన్ సర్కార్ కొట్టివేయడంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఎందుకంటే ఎన్నో మార్లు మద్యపాన నిషేదం తథ్యమని వైఎస్ జగన్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతే కాకుండా జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నవరత్నాలలో మద్యపాన నిషేదం కూడా ఒకటి. మరి మద్యపాన నిషేదం గురించి ప్రశ్నిస్తే.. ఆ హామీ తమ మానిఫెస్టో లోనే లేదంటూ మాట మార్చడం కేవలం జగన్ సర్కార్ కు మాత్రమే చెల్లిందంటూ.. ఏపీ ప్రజలు గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇక మరొకసారి మాటమార్చే వైకరి ని బయటపెట్టింది జగన్ సర్కార్. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దాంతో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. తీర అధికారం చేపట్టిన తరువాత ఆ హామీని కూడా పక్కన పెట్టేశారు.

ఇచ్చిన హామీ నెరవేర్చండి అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నప్పటికి ప్రభుత్వం మాత్రం ఆంటీ అంతనట్టుగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ఉపాధ్యాయులు దీనిపై ఆందోళనలు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తప్పక స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ” ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామని, హామీ ఇచ్చిన మాట నిజమేనని.. కానీ అధికారం చేపట్టిన తరువాత అది సాధ్యం కాదని తెలిసిందని ” మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి ఏపీ ప్రజలు కంగు తిన్నారు.. ఇచ్చే హామీల పైన కనీసం క్లారిటీ లేకుండానే హామీలిస్తూ ప్రజా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారని ప్రతి సామాన్యుడు కూడా నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. దీంతో హామీలివ్వడం ఎందుకు.. ? తరువాత వాటిని నెరవేర్చలేమని సాకులు చెప్పడం ఎందుకని.. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Also Read

కే‌సి‌ఆర్ నేషనల్ పాలిటిక్స్.. కీ ఫ్యాక్టర్స్ ఆ నాలుగే !

పోరాడతారా.. ఇంటికే పరిమితం అవుతారా ?

టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -