Thursday, April 25, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ నేషనల్ పాలిటిక్స్.. కీ ఫ్యాక్టర్స్ ఆ నాలుగే !

- Advertisement -

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు కూడా. ఆ మద్య కే‌సి‌ఆర్ ” భారత రాష్ట్ర సమితి ” పేరుతో ఒక కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రకటన రానప్పటికి.. జాతీయంగా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో మాత్రం ముందడుగు వేశారు. ఇప్పటికే బిహార్ లో పర్యటించి.. అక్కడ జేడీయూ, ఆర్ జెడి నేతలతో భేటీ కావడమే కాకుండా మీడియా సమక్షంలో పలు విషయాలు కూడా పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కే‌సి‌ఆర్ వైఖరిని తీక్షణంగా గమనించిన చాలా మందికి ఒక కామన్ డౌట్ రాక మానదు.

అదేమిటంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా కే‌సి‌ఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఎందుకు ఫోకస్ చేస్తున్నారని.. దీనికి కారణం కూడా లేకపోలేదు. కే‌సి‌ఆర్ భవిష్యత్ ప్రణాలికల ప్రకారమే పక్కా వ్యూహంతోనే ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ రాణిస్తారా ? లేదా ? అనే సంగతి కాస్త పక్కన పెడితే.. ఆయనకు కలిగే నాలుగు ప్రయోజనాల కోసమే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారని కొందరి విశ్లేషకుల అంచనా. ఇంతకీ ఆ నాలుగు ప్రయోజనలు ఏంటో చూద్దాం.. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కే‌సి‌ఆర్.. తన రాజకీయ వారసుడిగా కే‌టి‌ఆర్ ను ఇప్పటికే టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో ఉంచారు.

ఇక భవిష్యత్తులో కే‌టి‌ఆర్ ను ముఖ్యమంత్రి చేసే ఆలోచనలో కే‌సి‌ఆర్ ఉన్నట్లు పలు సందర్భాల్లో పరోక్షంగా చెప్పుకొచ్చారు కూడా. దీంతో రాష్ట్ర రాజకీయాలను తనయుడు కే‌టి‌ఆర్ కు అప్పగించి.. దేశ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ఎమర్జ్ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కే‌సి‌ఆర్ నేషనల్ పాలిటిక్స్ ను డిమాండ్ చేస్తున్న మరో ఫ్యాక్టర్.. రాష్ట్రంలో ఆయన పోటీ పడుతున్న రెండు పార్టీలు కూడా నేషనల్ పార్టీలు కావడం.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను పక్కన పెడితే.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం కాస్త గట్టిగానే చూపించే అవకాశం ఉంది.

అందువల్ల నేషనల్ పార్టీలను.. జాతీయంగానే ఎదుర్కోగలిగితే.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు తిరుగుండదని టి‌ఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.. ఇది కూడా కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల వైపు చూడడానికి ఒక కరణంగా చెప్పుకోవచ్చు. ఇక మూడవ కారణం ఏమిటంటే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై జాతీయ సంస్థల కేసుల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ప్రయోగిస్తున్న జాతీయ సంస్థలను ఎదుర్కోవాలంటే.. ఒక బలమైన జాతీయ నేతగా కే‌సి‌ఆర్ నిలిచినప్పుడు బీజేపీ అవాంఛిత శక్తులను కొంత మేర ఎదుర్కొనే అవకాశం ఉంది.. అన్నిటికంటే ముఖ్యమైన కారణం..పి‌ఎం హోదాలో కే‌సి‌ఆర్ నిలవాలని ఉవ్విళ్లూరుతుండడం.. ఇవ్వన్ని కూడా కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలవైపు ఫోకస్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

ఎల్లో మీడియా vs బ్లూ మీడియా.. ఏది జర్నలిజం !

జగన్ మాస్టర్ ప్లాన్.. నిన్న కుప్పం నేడు మంగళగిరి ?

పవన్ను దూరం పెట్టి ఎన్టీఆర్ వైపు.. బీజేపీ చూపు.. అసలు వ్యూహం తెలిస్తే మైండ్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -