Saturday, April 20, 2024
- Advertisement -

బాబు పాలనలో రాధాకృష్ణ కమీషన్ల బాగోతం బట్టబయలు

- Advertisement -

సంపాదకుడిని, జర్నలిస్టుని అని తన గురించి తాను డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు రాధాకృష్ణ. కమీషన్ ఏజెంట్, అవినీతి, బ్లాక్‌మెయిలింగ్ జర్నలిజంతో వందల, వేల కోట్లు సంపాదించాడు అని ఆయన సహచరులు కూడా ఆధారాలతో సహా చాలా సార్లు నిరూపించారు. అయినప్పటికీ చంద్రబాబుకు లాగే రాధాకృష్ణకు కూడా నిజాలు అవసరం లేదు. వాళ్ళు చెప్పాలనుకున్నది పదే పదే…..అదే పనిగా చెప్తూ ఉంటారు. జనాల చెవులు చిల్లులు పడేలా చెప్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆ అబద్ధాలను నిజాలుగా జనాలు భ్రమిస్తారని చంద్రబాబు, రాధాకృష్ణలిద్దరికీ గొప్ప నమ్మకం. గట్టిగా నాలుగు నెలల క్రితం టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి హరికృష్ణ పార్థివ దేహం దగ్గర కేటీఆర్, కేసీఆర్‌లతో చంద్రబాబు మంతనాలు చేస్తే అది అస్సలు తప్పుకాదు. కేసీఆర్ ఆంధ్రా వ్యతిరేకి కాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేసీఆర్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకోవాలన్న చారిత్రక నిర్ణయం దిశగా అడుగేసినట్టు. అదే కేసీఆర్‌కి చంద్రబాబు ఎలాంటి నాయకుడు, ఎలాంటి మనిషో తెలుసుకాబట్టి అలాంటి అబద్ధాలు, మోసం, కుట్ర రాజకీయాల నాయకుడిని నమ్మొద్దు, జగన్‌ని నమ్ముదాం అని ఆలోచించి జగన్‌కి మద్దతిస్తే మాత్రం అదే కేసీఆర్ ఆంధ్రావ్యతిరేకి అయిపోతాడు. ఈ రెండు రాతలూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణవే. ఈ రెండూ మాటలు చంద్రబాబువే.

మరి ఈ స్థాయిలో బాబు భజన రాధాకృష్ణ ఎందుకు చేస్తున్నట్టు? ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే 500కోట్లతో కంప్లీట్ అవ్వాల్సిన పట్టిసీమకు 1500కోట్లు ఎందుకు ఖర్చయినట్టు? రాధాకృష్ణకు ఆంధ్రప్రదేశ్ నాట పవర్ ప్లాంట్‌ల వెనక సపోర్ట్ ఎవరు? ఇంకా రాజధాని నుంచి బాబు పాలనలో కాంట్రాక్టులు, కమీషన్లు రాధాకృష్ణకు ముడుతున్నవి ఎన్ని? ఈ లెక్కలన్నీ తెలియాలి. ఈ లెక్కల వెనుక అసలు నిజాలను ఇఫ్పుడు స్వయంగా చంద్రబాబు తోడల్లుడు, రాధాకృష్ణ జాతకం మొత్తం కూడా మొదటి నుంచీ తెలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయటపెట్టాడు. భజన వెనకాల అసలు కారణాలను సాక్ష్యాలతో సహా చెప్తూ రాధాకృష్ణ భజన వెనక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేశాడు. బాబే మళ్ళీ రావాలి అని చెప్పి బాబు భజన ఓ స్థాయిలో చెయ్యడం, జగన్ ఇంట్లో షర్మిళ, విజయమ్మలతో మాట్లాడిన మాటలు అంటూ జగన్‌పై ఇష్టారీతిన వ్యతిరేక వార్తలు రాయడం, జగన్ వ్యక్తిత్వాన్ని కించపర్చడం, జర్నలిజం వృత్తికే కళంకంలా ఉండేలా రాతల వెనక రాధాకృష్ణ సొంత అభివృద్ధి ఎన్ని వందల వేల కోట్లో దుగ్గుబాటి వివరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -