Thursday, April 18, 2024
- Advertisement -

సీన్ రివర్స్… ఫస్ట్ వికెట్ ఎస్‌వి మోహన్‌రెడ్డిదే….. చంద్రబాబుకు వార్నింగ్

- Advertisement -

2019 ఎన్నికల్లో జగన్‌ని ఓడించడానికి చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలన్నీ ఎదురుతన్నుతున్నాయి. జగన్ పార్టీయే ఉండకూడదని కోట్లాది రూపాయలతో వైకాపా ఎమ్మెల్యేలను కొనేశాడు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటి ఆంధ్రప్రదేశ్‌కి ప్రజలకు ఉపయోగపడే హామీలను అడగడం మానేసి సీట్లు పెంచితే చాలు అని మోడీతో మొరపెట్టుకున్నాడు. అయితే మోడీ అందుకు కూడా ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు రివర్స్ అవుతున్నాడు. ఎలా అయినా మోడీ చేత సీట్ల పెంపు నిర్ణయం వచ్చేలా చేయాలని తెరవెనుక రాజకీయాలు చేస్తున్నాడు. అయితే మోడీ మాత్రం కేవలం ఒకరి రాజకీయ స్వార్థం కోసం రాజ్యాంగ సవరణ ఎలా చేస్తామని…అలా చేస్తే జాతీయ స్థాయిలో పరువుపోతుందని చెప్తున్నాడు. సీట్ల పెంపు లేదన్న విషయం టిడిపి నాయకులు అందరికీ అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఫిరాయింపు నేతలు అందరూ కూడా జాగ్రత్తపడిపోతున్నారు.

కర్నూలు అసెంబ్లీ టిడిపి టిక్కెట్ నాదే అని చెప్పి టీజీ వెంకటేష్ కొడుకు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. 2014లో వైకాపా నుంచి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచిన ఎస్వీ మోహనరెడ్డి కూడా ఇప్పుడు టిడిపిలోనే ఉన్నాడు. చంద్రబాబు వాలకం చూస్తూ ఉంటే ఆర్థికంగా ఎస్వీ మోహన్‌రెడ్డికంటే ఎంతో బలవంతుడైన టీజీ వెంకటేష్ కొడుక్కే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. టిజి వెంకటేష్‌కి మాట ఇచ్చేశాడని కూడా బాబు సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాటలే ఎస్వీ మోహన్‌రెడ్డిలో భయాన్ని పెంచాయి. కర్నూలు జిల్లా మొత్తాన్ని కూడా భూమా కుటుంబానికి నమ్మకంగా అప్పగించాడు జగన్. అయితే జగన్‌ని సొంత సోదురుడిలా భావించే శోభా నాగిరెడ్డి మరణం…జగన్ అధికారంలోకి రాలేకపోవడం…..భూమానాగిరెడ్డిని చంద్రబాబు బెదిరించడం, కేసులతో భయపెట్టడం, కోట్లాది రూపాయలతో ప్రలోభ పెట్టడంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ సందర్భంలోనే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా జగన్‌కి ద్రోహం చేసి పార్టీ మారిపోయాడు. అయితే ఇప్పుడు 2019లో తన పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటే ఎస్వీ మోహన్‌రెడ్డికి శూన్యమే కనిపిస్తోంది. పాతికేళ్ళుగా చంద్రబాబుతో రాజకీయ సావాసం చేస్తున్నవాళ్ళే నమ్మరు. ఇక ఎస్వీ మోహన్‌రెడ్డి ఎలా నమ్ముతాడు? అందుకే తాజాగా చంద్రబాబుని కలిసిన ఎస్వీ మోహన్‌రెడ్డి బాబుకు సీరియస్‌గా కొన్ని విషయాలు చెప్పాడట. టిజి వెంకటేష్ కొడుకు కర్నూలు టిడిపి ఎమ్మెల్యే టికెట్ నాదే అని చెప్పుకుంటూ ఇలానే ప్రచారం చేసుకుంటూ ఉంటే నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుందని చెప్పాడట. పార్టీ ఫిరాయించినప్పుడు 2019లో టికెట్ ఇస్తానని మాట ఇచ్చారని….ఆ మాట నిలబెట్టుకోవాలని బాబుకు చెప్పాడట ఎస్వీ మోహన్‌రెడ్డి. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలో గెలుపోటముల లెక్కలను బట్టే టిక్కెట్ ఇస్తానని…..ఇప్పుడే ఏ విషయం చెప్పలేనని….2019 ఎన్నికల వరకూ కూడా పార్టీ కోసం కష్టపడాలని చెప్పాడట. బాబు మాటలు విన్న ఎస్వీ మోహన్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జగన్‌కి దూరమై చాలా పెద్ద పొరపాటు చేశానని…..చంద్రబాబును అస్సలు నమ్మలేమని..ఎలా అయినా జగన్ తనను వైకాపాలో చేర్చుకునేలా ఒప్పించాలని వైకాపాలో ఉన్న తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపుతున్నాడట. శోభానాగిరెడ్డి అంటే జగన్‌కి చాలా గౌరవం. ఆమెపైన ఉన్న గౌరవంతో ఎస్వీ మోహన్‌రెడ్డిని జగన్ చేరదీసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే మాత్రం బాబుకు సూపర్ షాక్ తగిలినట్టే. 2019 ఎన్నికల నాటికి జగన్ పార్టీ లేకుండా చేయాలని పన్నిన వ్యూహాలు ఎదురు తన్నినట్టే. ముందు ముందు ఇలాంటి జంపింగ్స్ ఇంకా చాలానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజాగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు….చేజారిపోతున్న నాయకుల విషయంలో ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -