Saturday, May 4, 2024
- Advertisement -

ఆయ‌న స‌న్నిహితులు ఏమంటున్నారో తెలుసా…?

- Advertisement -

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఇప్ప‌టికె ఉన్న రాకీయ అనిశ్చిత స‌రిపోద‌న్న‌ట్లు కొత్తగా మరో ట్విస్ట్ అదనంగా దానికి వచ్చి చేరింది. రాకీయాల్లో వ‌స్తాన‌న్న రాజినీకాంత్‌పై క‌మ‌ల్‌హాస‌న్ విమ‌ర్శ‌లు చేశారు. అప్ప‌టినుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న కమల్‌ హాసన్‌ను స్వయంగా ప్ర‌క‌టించారు. ఇంత వ‌న‌రే బాగాపు ఏంది. అస‌లు ట్విష్ట్ ఏంటంటె ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తమిళ సూపర్ స్టార్ కమల హాసన్‌ను కలవబోతుండడం హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయాల్లోకి రానున్నట్టు కమల్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. కమల్ కొత్త పార్టీ కనుక పెడితే ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఉబలాటపడుతోంది. దక్షిణాదిన కమల్‌ను కలుపుకుపోవడం ద్వారా బలీయమైన శక్తిగా ఎదగాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

అయితే కేజ్రీవాల్‌ను లంచ్‌ కోసమే ఆహ్వానించానని కమల్‌ చెబుతున్నప్పటికీ.. పార్టీ లాంఛ్‌ కోసం వీరిద్దరు చర్చిబోతున్నాడంటూ ఇప్పటికే పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఆలోచన మాని.. ఆప్‌తో జోడీ కట్టబోతున్నాడా? తమిళ రాజకీయాల్లో చీపురు ప్రస్థానం ప్రారంభించబోతుందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితె వీరి భేటీపై క‌మ‌ళ్ స‌న్నిహితులు మాత్రం మ‌రో విధంగా సెల‌విస్తున్నారు. వ‌స్తున్న ఊహాగానాల‌పైఎలాంటి నిజం లేకపోవచ్చేనే కమల్‌ సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి కమల్‌ ఆలోచన ఏంటో ఎవరితోనూ ఇప్పటిదాకా పంచుకున్న దాఖలాలు లేవు. పైగా ఏ పార్టీ మీద కూడా ఆయనకు సదుద్దేశ్యం లేదు. అందుకే వీరిద్దరి భేటీపై తొందరపడి ఊహగానాలు వద్దని మీడియాకు ఆయన సూచిస్తున్నారు. భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఎలాఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -