Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలు.. రఘురామ కన్ఫర్మ్ !

- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికల చర్చ ఆ మద్య గట్టిగానే సాగింది. ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని, అందుకే జగన్.. వైసీపీ నేతలను ఎన్నికల సమరానికి స్ద్దమ్ చేస్తున్నారని ఆ మద్య వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దమే అనే సంకేతాలు ఇచ్చింది. మరో వైపు జనసేన అధ్యక్షుడు కూడా ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమే అని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ తరువాత తెరవెనుక ఏమైందో తెలియదు గాని ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఊసే లేకుండా పోయింది.

ఇక ఇటీవల అధికార వైసీపీ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం లేదని… స్పష్టం చేశారు. దాంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని స్పష్టమైంది. అయితే ఇంతలోనే తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోష్యం చెప్పారు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరి చేత జగన్ రాజీనామాలు చేయించే అవకాశం ఉందని, ఆ తరువాత మూకుమ్మడిగా అందరిచేత రాజీనామాలు చేయించి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ” రఘురామ అంచనా వేశారు.

దీంతో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వికేంద్రీకరణలో భాగంగా విశాఖ గర్జనను ఏర్పాటు చేసిన వైసీపీ.. ఇంకా రాబోయే రోజుల్లో మూడు రాజధానుల కోసం మద్దతు కూడగట్టుకునేందుకు పదునైన వ్యూహాలు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అదే గనుక జరిగితే రఘురామ కృష్ణంరాజు చెప్పినట్లుగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -