Saturday, April 27, 2024
- Advertisement -

వైసీపీ ఏడో జాబితా..వచ్చేస్తోంది

- Advertisement -

వైనాట్ 175..ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ముందున్న లక్ష్యమిదే. రెండోసారి అధికారమే లక్ష్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చగా ఇప్పటివరకు 6 జాబితాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.

ఇక తాజాగా ఏడో జాబితా కూడా రెడీ అయింది. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారో ఆ ఎమ్మెల్యేలను స్వయంగా పిలిపించి మాట్లాడుతున్నారు జగన్. ఎందుకు మార్చాల్సి వస్తుందో, భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు.

ఇక ఏడో జాబితాలో ఒంగోలు పార్లమెంటు ఇంఛార్జిగా ఎవరిని నియమించారు అన్నదానిపై స్పష్టత రానుంది. ఈ సీటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అవనిగడ్డ ఇంఛార్జిగా సింహాద్రి చంద్రశేఖర్‌ను ప్రకటించగా వయసు రిత్యా తనను తప్పించి కొడుకు ఇవ్వాలని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఏడో జాబితాలో నెల్లూరు, విజయనగరం, అనకాపల్లి, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను ప్రకటించే అవకాశం ఉంది. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో రావెల కిషోర్ బాబు లేదా మెరుగు నాగార్జునను నియమించే అవకాశం ఉంది. మొత్తంగా ఏడో జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయోనని టెన్షన్ మాత్రం అందరిలో మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -