Thursday, April 25, 2024
- Advertisement -

వాలెంటిర్ల పై గరం గరం..!

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదికారంలోకి వచ్చిన తరువాత వాలెంటీర్ వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలెంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా మార్చారు. అయితే ఈ వాలెంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి కూడా ప్రశంశల కంటే విమర్శలే ఎక్కువగా వింపిస్తున్నాయి. ఈ వాలెంటీర్ వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానా కు గండి పడుతోందని, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతే కాకుండా వాలెంటిర్లను ప్రభుత్వ పనుల నిమిత్తం కాకుండా వైసీపీ పార్టీ పనుల నిమిత్తం జగన్ వాడుకుంటున్నారనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ పనుల్లో కూడా వాలెంటిర్లు కనిపించడమే. ఎందుకంటే గత ఏడాది కాలంలో ఏపీలో పలు చోట్ల జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీ .. వాలెంటిర్లను ఎన్నికల్లో ఉపయోగించుకుందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మొత్తానికి వాలెంటిర్లపై వైసీపీ కార్యకర్తలనే ముద్ర పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వాలెంటిర్లను రాబోయే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చూసిన వైసీపీ పార్టీకి ఎలక్షన్ కమిసఃన్ షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో వాలెంటిర్లను విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

ఏ అభ్యర్థి తరుపున కూడా ఏజెంట్లుగా పోలింగ్ బూతుల్లోకి వాలెంటిర్లు ప్రవేశించరాదని స్పష్టం చేశారు. అంతే కాకుండా దీనికి సంభందించి కలెక్టర్లకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది వైసీపీ కి మింగుడుపడని విషయం అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వాలెంటిర్ల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో వాలెంటిర్లను గట్టిగా ఉపయోగించుకుందాం అనుకున్న వైసీపీ పార్టీకి ఈసీ ప్రకటన షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరి వాలెంటిర్ల ప్రమేయం లేకుండా వచ్చే ఎన్నికల కొరకు వైసీపీ ఎలాంటి ప్రణాళికలు వేస్తుందో చూడాలి.

Also Read

పిల్లల విషయంలో.. జగన్ తప్పుచేస్తున్నారా ?

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

గులాబీ బాసుకు.. గుబులు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -