Friday, April 26, 2024
- Advertisement -

గులాబీ బాసుకు.. గుబులు ?

- Advertisement -

తెలంగాణలో రోజురోజుకూ టి‌ఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి .. ఆ పార్టీ అధినేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఏక చక్రధిపత్యం కొనసాగిస్తున్న గులాబీ బాసు కు విపక్షాలు షాక్ ఇస్తున్నాయి. ప్రజలు కే‌సి‌ఆర్ పరిపాలనపై విముఖత చూపుతున్నారనే విషయం ఈ మద్య కాలంలో జరిగిన ఉపఎన్నికలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమౌతుంది. మొదట దుబ్బాక ఉపఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ తరువాత జరిగిన జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కూడా టి‌ఆర్‌ఎస్ విజయం సాధించినప్పటికి.. టి‌ఆర్‌ఎస్ కు ధీటుగా బీజేపీ కూడా సీట్లు కైవసం చేసుకుంది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ కేతనం ఎగురవేయడంతో ప్రజలు టి‌ఆర్‌ఎస్ పై విముఖత చూపుతున్నారు అనే విషయం అర్థమౌతుంది.

ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్య వర్గ సమావేశాలకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా గులాబీ బాసు ను భయపెడుతున్న అంశాలలో ఒకటి. దాంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. దాంతో కే‌సి‌ఆర్ కు కూడా రాబోయే ఎన్నికల్లో విజయంపై డౌట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పేరు మోసిన రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకొని పరువు నిలుపుకోవాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. .అందుకే జాతీయ పార్టీ ప్రకటన కూడా పక్కన పెట్టేశారని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేలలో కూడా టి‌ఆర్‌ఎస్ కు వ్యతిరేక పవనలు విచ్చినట్లు తెలుస్తోంది. అందుకే క్షేత్ర స్థాయి నుంచి ఎమ్మెల్యేల పని తీరుపై కే‌సి‌ఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా నియోజిక వర్గాలలో యాక్టివ్ గా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చే ఆలోచనలో సి‌ఎం కే‌సి‌ఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం అమలౌతున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తెలంగాణలో బలపడుతుండడం.. అదే సమయంలో టి‌ఆర్‌ఎస్ పై ప్రజల్లో విముఖత ఏర్పడుతుండడం.. ఇవన్నీ కూడా కే‌సి‌ఆర్ ను భయపెడుతున్న అంశాలుగా చెప్పుకోవచ్చు.

Also Read

విడ్డూరం : మూడు పార్టీల్లో “జంపింగ్ జపాంగ్ ” ?

బాబు, జగన్ లకు అగ్ని పరీక్ష.. మరి పవన్ సంగతేంటి ?

అంబటి.. మాట తీరు మారెనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -