నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థిగా నోముల భగత్‌కుమార్‌కు అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ భగత్‌కుమార్‌కు బీ-ఫారమ్ అందజేశారు.
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురవయ్యయాదవ్, రంజిత్‌యాదవ్, బాలరాజ్‌యాదవ్ తదితరులు కూడా టికెట్ ఆశించారు.
వీరందరి పేర్లను పరిశీలించి, సర్వేలు చేయించి… ఎట్టకేలకు టికెట్‌ను భగత్‌కుమార్‌కు ఇచ్చారు.పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు భగత్‌కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
లాంటి వారిని దూరం పెట్టండి.. సురేఖ వాణి షాకింగ్ పోస్ట్
