Thursday, April 18, 2024
- Advertisement -

బీజేపీలో చేరిన మాజీ మేయర్..!

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందే తడవుగా పార్టీల రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. కొందరు ఉన్న పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారు. పరిణామాలు చాలా ఫాస్ట్ గా మారుతున్నాయి. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని… పార్టీ తనను రెండు సార్లు మోసం చేసిందని అన్నారు. బీజేపీలో చేరడం తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నారు. బీజేపీలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే తాను ఈ పార్టీలో చేరానని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను కార్పొరేటర్ గా పోటీ చేయడం లేదని, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేద్దామని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి చెప్పారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి నాయకుడు కలిసికట్టుగా పని చేశాడని అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

ఈసారి సతీసమేతంగా ఢిల్లీకి సీఎం జగన్..? ఎందుకు..?

గవర్నర్ తో జగన్ భేటీ.. మతలబ్ ఎంటీ..?

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -