Wednesday, April 24, 2024
- Advertisement -

గవర్నర్ తో జగన్ భేటీ.. మతలబ్ ఎంటీ..?

- Advertisement -

దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను అఫీషియల్ కలిసారు. అయితే సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ కలయిక వెనక ఎదో మతలబ్ ఉందని టీడీపీ భయపడుతుందా…? ఈ మద్యనే వరసగా డీల్లీ పెద్దలను కలిసిన తరువాత మొదటిసారి గవర్నర్ ను జగన్ కలవడం పై ప్రదాన్యత సంతరించు కుంది. ఎందుకంటే అదికారం లో కి వచ్చిన మొదటినుంచి టీడీపీ ఆయంలో జరిగిన అవినీతీపై ఉక్కుపాదం మోపిన జగన్.. తవ్వకాలు మొదలుపెట్టారు. అమరావతి భూముల కుంభకోణం, ఈఎస్ఐ, ఏపీ ఫైబర్ గ్రిడ్ లాంటి పలు అంశాల్లో అవినీతి జరిగిందని వివరాలను సేకరించారు.

ఇందులో బాగంగా ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడును సీఐడీ అరెస్ట్ చేయగా.. నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పుతున్నారని జేసీ, ఆయన కుమారుడును పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పి. నారాయణ, అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్, నమల రామకృష్ణుడు, బొండా ఉమా, కూన రవికుమార్, గొట్టిపాటి రవి లపై కూడా కేసులు నమోదయ్యయి. వీరిలో కొంతమంది జైలుకు కూడా వెళ్లివచ్చిన విషయం తెలిసిందే.

అమరావతిలో భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై కూడా సీబీఐకి అప్పగించాలని జగన్ ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీబీఐను రాష్ట్రంలోకి రానివ్వకుండా విధించిన నిబంధనలను కూడా ఎత్తివేశారు. అయితే ముందుగానే పసికట్టిన టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి సీబీఐ విచారం మీద స్టే తెచ్చుకోవడం జరిగింది.

అప్పటి నుండి స్పీడ్ తగ్గిన జగన్ చాలా రోజుల తర్వాత గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు అంటు కలవడంపై… అమరావతిలో భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై సీబీఐ విచారణ అంశం పై కూడా చర్చ జరిగుండవచ్చుని రాజకీయగా చర్చకు తావిస్తోంది. ఎందుకంటే గవర్నర్ అనుకుంటే కేంద్రం నుండి వత్తిడి తెచ్చి సీబీఐ విచారణ జరిపే అవకాశాలున్నాయని టీడీపీ లో అలజడి మొదలైంది.

కేబినెట్ తీర్మానాల్లో చంద్రబాబు పోలవరం గుట్టు…?

అడ్డదారులు వెతుకుతున్న చంద్రబాబు..

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -