Thursday, April 25, 2024
- Advertisement -

ఏపి సీఎం జగన్ ని తెగ మెచ్చుకుంటున్న నటుడు, మాజీ కేంద్ర మంత్రి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి టీకాలు వేయాలని ఆదేశించారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఆస్కారం ఉండకూడదన్నారు.

కరోనా రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స అందించాలని స్పష్టం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు శతృఘ్నసిన్హా ప్రశంసించారు. కరోనా పై ఏపి సీఎం తీసుకున్న సంచలన నిర్ణయం ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా దీనిని అమలు చేయాలంటూ ట్వీట్‌ చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో కరోనా చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని, ఇది సరైన సమయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు.

అజ్ఞాతం వీడింది.. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్!

అబ్దుల్లాపూర్ మెట్ లో రోడ్డు ప్రమాదం.. సీఐ దంపతులు మృతి..!

భూమిపై వచ్చే రాకెట్ పై క్లారిటీ ఇచ్చిన చైనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -