Sunday, May 5, 2024
- Advertisement -

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ…?

- Advertisement -

అధికార పార్టీ టీడీపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీని చాలామంది విడుతున్నారు. ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ లండ‌న్ టూర్‌కు వెళ్ల‌డంతో వ‌ల‌స‌ల‌కు వారం సెల‌వులు వ‌చ్చాయి. తాజాగా జ‌గ‌న్ లండ‌న్ టూర్ ముగించుకుని తిరిగి రావ‌డంతో మ‌ళ్లీ వైసీపీలోకి వ‌ల‌సలు పెరిగాయి. తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే పార్టీ విడుతున్న‌ట్లు స‌మాచారం. కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ పార్టీని విడుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా పార్టీలో అంస‌తృప్తితో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌న్న‌వ‌రం నియోజిక వ‌ర్గం , విజ‌య‌వాడ సిటీలో ఉన్న‌ప్ప‌టికి , అక్క‌డ జర‌గుతున్న కార్య‌క్ర‌మాల‌కు త‌న‌ను సంప్ర‌దించ‌డం లేద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల ద‌గ్గ‌ర వాపోతున్నార‌ట‌. పైగా పార్టీలో తాను ఉన్న‌ట్లు ఎవ్వ‌రు గ్ర‌హించ‌డం లేద‌ని తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట వంశీ.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. వంశీని పార్టీలోకి తీసుకురావ‌డానికి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని స‌మాచారం. వంశీ ,నాని ఇద్ద‌రు మంచి స్నేహితుల‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వంశీ వైసీపీలో చేరుతున్నార‌నే ప్ర‌చారం జరిగింది. కాని ఆయ‌న ఎందుక‌నో టీడీపీలోనే ఉండిపోయారు. కొడాలి నాని, వంశీ ఇద్ద‌రు ఎన్టీఆర్‌కు స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో వీరికి టికెట్లు రావ‌డం వెన‌క ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంది. నాని గ‌త ఎన్నిక‌ల‌లోనే టీడీపీని వీడి వైసీపీ చేరారు. ఇప్పుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే వంశీ ఎట్టి పరిస్ధితుల‌లో పార్టీని వీడ‌ర‌ని అంటున్నారు వారి స‌న్నిహితులు. టీడీపీలో వంశీకి స‌ముచిత స్థానం ఉంది. అలాంట‌ప్పుడు ఆయ‌న టీడీపీని ఎందుకు వీడుతార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌న్నవ‌రంలో టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది. ఆయ‌న మ‌ళ్లీ గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేసి విజ‌యం సాధిస్తార‌ని ఆయ‌న అనుచ‌రులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి పార్టీ మార్పుపై వంశీ మ‌న‌స్సులో ఏముందో తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -