Sunday, May 5, 2024
- Advertisement -

వైకాపాలోకి గుంటూరు జిల్లా, తాడికొండ టిడిపి ఎమ్మెల్యే

- Advertisement -

టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలే వరుసగా వైకాపాలో చేరడానికి ఉత్సాహం చూపించడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే చంద్రబాబు శతథా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎన్నికల్లో టిడిపినే అధికారంలోకి వస్తుందని ఆశ చూపించి నేతలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టిడిపి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక టిడిపి క్యాడర్‌కి కూడా అలాంటి నమ్మకం కలగడం లేదు. ఐదేళ్ళపాటు అధికారాన్ని అనుభవించిన ఆర్థిక మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు కూడా 2019 తర్వాత ఐదేళ్ళపాటు వ్యాపారాలు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు.

టిడిపి నేతలు, భజన మీడియా జనాల వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. అందుకే ఆ మధ్య పరిటాల గ్రూప్, భజన మీడియా అధినేత రాధాకృష్ణతో పాటు చంద్రబాబుతో సహా అందరూ కూడా వెలమ-కమ్మ గ్రూప్ అంటూ వెల్కం గ్రూప్ అంటూ కేసీఆర్‌తో కలిసి రాజీకయాలు చేశారు. అయితే తెలంగాణా ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసులో బాబును కాపాడిన కేసీఆర్‌కి వెన్నుపోటు పొడవాలని ప్లాన్ చేశారు ఈ పచ్చ బ్యాచ్ జనాలు. తెలంగాణా ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా కూడా బాబు పరపతిపోయింది. ఎపిలో బాబు అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని జాతీయ స్థాయి నేతలు కూడా నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో లక్షల సంఖ్యలో ఉన్న సీమాంధ్రులు కూడా చంద్రబాబుపై పూర్తి వ్యతిరేకతతో కేసీఆర్‌కి ఓట్లు వేశారు. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అని చెప్తూ ఉండడంతో స్వయంగా టిడిపి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కామెడీ రాజకీయాలను నమ్మలేకపోతున్నవీళ్ళు జగన్ విషయంలో మాత్రం మాట మీద నిలబడతాడు, భవిష్యత్ చూసుకుంటాడు అన్న నమ్మకంతో వైకాపాలో చేరుతున్నారు. ఆ లిస్టులోకి తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కూడా చేరేలా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నాయకులందరితో చంద్రబాబు భేటీ అయ్యారని తోక భజన పత్రిక రాసుకొచ్చింది. శ్రవణ్‌పై ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందని, స్థానిక టిడిపి నాయకులు కూడా శ్రవణ్‌కి టికెట్ ఇస్తే ఓడిస్తాం అని హెచ్చరికలు చేస్తున్నారని పచ్చ మీడియాలో వార్తలు రాస్తున్నారు.

ఈ రాతల పుణ్యమాని పచ్చ మీడియా డ్రామాలు తెలిసినవాళ్ళందరికీ కూడా త్వరలోనే శ్రవణ్ కూడా వైకాపాలో చేరడం ఖాయం అని అర్థమయిపోయింది అని విశ్లేషకులు చెప్తున్నారు. వారం క్రితం వైకాపాలో చేరిన టిడిపి ఎమ్మెల్యే విషయంలో కూడా పచ్చ మీడియా ఇలాంటి రాతలే రాసింది. ఇప్పుడు ఈ గుంటూరు జిల్లా ఎమ్మెల్యే విషయంలో కూడా అదే రాతలు మొదలెట్టింది. ఏది ఏమైనా టిడిపికి గుండెకాయ, కమ్మ వర్గం జనాలు చాలా ఎక్కువగా ఉంటారు అని చెప్పుకునే గుంటూరు జిల్లా నుంచి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే పార్టీని వీడితో మాత్రం అది చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ అవ్వడం ఖాయం అని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -