Friday, May 3, 2024
- Advertisement -

వైఎస్ విజయమ్మకు శరణుజొచ్చిన అఖిలప్రియ…… టిడిపిలో హాట్ టాపిక్

- Advertisement -

దాచేపల్లి దుర్ఘటన నేపథ్యంలో రోజా వ్యాఖ్యలు చంద్రబాబును తీవ్రంగా బాధించాయి. ఇక హీరోయిన్ ప్రత్యూష తల్లి కూడా ప్రత్యూషపై అత్యాచారం, హత్యల విషయంలో చంద్రబాబు నిందితులకు అండగా నిలిచారని, ఆ నిందితులందరూ బాబుకు సన్నిహితులేనని…. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మహిళలకు ఎక్కడ రక్షణ ఉంటుందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ తనను సమర్థిస్తూ మాట్లాడాలని చెప్పి అఖిలప్రియను ఆదేశించాడు చంద్రబాబు. అయితే అఖిలప్రియ మాత్రం చంద్రబాబును సమర్థిస్తూ రోజాకు కౌంటర్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ పరిణామం టిడిపినేతలకు ఆశ్ఛర్యం కలిగించింది.

ఇక ఇఫ్పుడు తాజాగా మరో పరిణామం టిడిపి నేతలకు షాక్ తగిలేలా చేసింది. విజయమ్మతో అఖిలప్రియ ఫోన్‌లో మాట్లాడారట…….‘చంద్రబాబు దారుణంగా అవమానిస్తున్నాడని, బాబు కుట్ర రాజకీయాలను భరించే శక్తి తనకు లేదని, జగనన్నకు చెప్పి వైకాపాలో చేర్చుకోమని చెప్పండని’ విజయమ్మను వేడుకుందట అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కూడా లేని నేపథ్యంలో బాబు రాజకీయాలను ఎదుర్కునే శక్తి లేదని, ఎస్వీ సుబ్బారెడ్డిని కావాలనే తనపైకి రెచ్చగొడుతున్నాడని అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. 2019 ఎన్నికల్లో ఆళ్ళగడ్డ టిక్కెట్ ఇస్తానని కూడా స్పష్టంగా చెప్పకుండా……ఎస్వీ సుబ్బారెడ్డి, అఖిలప్రియలపై సొంత సర్వే చేయించి….. ఆ సర్వేలో ఎవరు గెలుస్తారని తేలితే వాళ్ళకే టికెట్ ఇస్తానని చెప్పడం కూడా అఖిలప్రియలో భయాందోళనలు పెంచుతోంది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే భూమా కుటుంబాన్ని రాజకీయంగా లూప్ లైన్‌లోకి నెట్టాలన్న ప్రయత్నంలో బాబు ఉన్నారన్న అభిప్రాయం కలుగుతోందని తన సన్నిహితులతో చెప్పుకుంది అఖిలప్రియ. మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అఖిలప్రియ అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -