కోమటిరెడ్డి విషయంలో ఈటెల సెంటిమెంట్ ?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వేడి వేడి చర్చలంతా.. కోమటిరెడ్డి రాజగోపాల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన బీజేపీలో చేరానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 21 న చౌటుప్పల్ లో జరిగే బీజేపీ సభకు అమిత్ షా హాజరు కానున్నారట. దాంతో అమిత్ షా అధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. ఈ సంగతి అలా ఉంచితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక ఖాయమైంది. ఈ ఉపఎన్నికను అన్నీ పార్టీలు కూడా సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి..

ఈ ఉపఎన్నికల్లో ముడుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి బీజేపీ తరుపున బరిలోకి దిగనున్నారు. అయితే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో మంచి పట్టు సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో మునుగోడు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డి తన గెలుపుపై కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికి ఇంటర్నల్ గా సీన్ వేరే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజిక వర్గాన్ని అభివృద్ది చేయడంలో విఫలం అయ్యాడని, కనీసం రోడ్ల వసతులు కూడా ఏమాత్రం కల్పించలేదని, తన వ్యాపారాలపై చూపించే శ్రద్ద.. నియోజిక అభివృద్ది పై చూపలేదనే వాదనలు మునుగోడు ప్రజల నుంచి వ్యక్తమౌతున్నాయి. దాంతో మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే బీజేపీ తరుపున ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి కచ్చితంగా గెలుస్తాడని కాషాయదళం లో వినిపిస్తున్న మాట.

ఎందుకంటే గతంలో అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ తరుపున హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నాడు. దాంతో ఈటెల సెంటిమెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా రిపీట్ అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. అయితే ఈటెలకు వ్యక్తిగతంగా కూడా నియోజిక వర్గంలో మంచి పట్టు ఉంది. మంత్రి హోదాలో ఉన్నప్పుడూ కూడా నియోజిక వర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాడు. అంతే కాకుండా తరచూ కార్యకర్తలతో పాటు హుజూరాబాబ్ ప్రజలతో కూడా మమేకం అవుతుండేవారు. దాంతో ఆ నియోజిక వర్గ ప్రజలు అప్పటికే ఈటెలకు 6 సార్లు ఎమ్మెల్యే పదవి కట్టపెట్టారు. ఇకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మునుగోడు నియోజికవర్గ ప్రజలు కాస్త అసహనంగా ఉన్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి బీజేపీ భావిస్తున్నట్లుగా ఈటెల సెంటిమెంట్ కోమటిరెడ్డి విషయంలో రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

Also Read

కే‌సి‌ఆర్ పై మోడీ.. ఈడీ అస్త్రం ?

మోడీ తటస్థ వైఖరి.. వ్యూహంలో భాగమేనా ?

కుప్పం జగన్ అడ్డాగా మారుతుందా ?

Related Articles

Most Populer

Recent Posts