మోడీ తటస్థ వైఖరి.. వెనుక రాజకీయ వ్యూహం !

ప్రస్తుతం ఏపీ లోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు డిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర చేసుకునేందుకు ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి, మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నువ్వా నేనా అన్నట్లుగా పోటుపడుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇరు పక్షాలపై తటస్థంగానే వ్యవహరిస్తున్నారు. అయితే సి‌ఎం జగన్ అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరు కూడా మోడీకి దగ్గర కావడం వెనుక వారి సొంత ప్రయోజనలు తప్ప రాష్ట్రప్రయోజనలేవీ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ఈ విషయం అలా ఉంచితే.. ప్రధాని మోడీ ఇరు పార్టీల నేతలపై కూడా సమానాత్వాన్ని ప్రదర్శించడంపై రాజకీయ వ్యూహం ఉండే అవకాశం ఉదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. .

సాధారణంగా కమలనాథులు పార్టీ పరంగా ముందు చూపు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. వాజ్ పెయ్ నుంచి నేటి నరేంద్ర మోడీ వరకు బీజేపీ నేతలంతా కూడా పార్టీ బలం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం ఏపీలో బీజేపీ అత్యంత బలహీనమైన పార్టీగా ఉంది. అందువల్ల భవిష్యత్ లో బీజేపీని ఏపీలో బలమైన పార్టీగా నిలపాలంటే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న పార్టీలతో సన్నిహిత్యంగా ఉండక తప్పదు. ఈ కారణం చేతనే చంద్రబాబు, జగన్ తో సన్నిహిత్యం అనే వ్యూహాన్ని మోడీ ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు మోడీ పై చంద్రబాబు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే.

మోడీని వ్యక్తిగతంగా కూడా ధూశించారు చంద్రబాబు..అయినప్పటికి ఇవన్నీ పక్కనపెట్టి ” ఆజాదీ క అమృత్ మహోత్సవ్ ” సమావేశాలకు చంద్రబాబు ను ఆహ్వానించారు నరేంద్ర మోడీ. ఈ సమావేశంలో మోడీ చంద్రబాబు మద్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి, కేంద్రంతో టీడీపీ పొత్తు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే సి‌ఎం జగన్ కూడా ఆ మద్య కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల కాస్త అసహనాన్ని ప్రధార్శించారు. కానీ నీతి అయోగ్ సమావేశాలలో మాత్రం ప్రధాని మోడితో ఆప్యాయంగా కనిపించారు. ఇలా ఏపీలోని ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలతో సమపాళ్లలో సంబందాలు కొనసాగిస్తూ.. రాబోయే ఎన్నికల టైమ్ కి అవసరమైన పార్టీతో మాత్రమే సంబందాలు కొనసాగిస్తూ.. అవసరం లేని పార్టీని తదుపరి దూరం పెట్టె ఆలోచన కూడా మోడీ లో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి మోడీ ఏపీ నేతలతో కొనసాగిస్తున్న ఈ సత్సంబంధాలు ఎంతవరకు కొనసాగుతాయో చూడాలి.

Also Read

మోడీకి చెక్ పెట్టేందుకు కేజ్రివాల్ మాస్టర్ ప్లాన్ !

తూచ్.. గురంట్లపై చర్యలు తీసుకోవట్లే ..!

తప్పు.. ప్రభుత్వానిదా..ప్రతిపక్షాలదా ?

Related Articles

Most Populer

Recent Posts