Thursday, May 9, 2024
- Advertisement -

మేథావుల ఆలోచ‌న‌లకు కార్య‌రూపం.. పాత పంథాకు చ‌ర‌మ‌గీతం

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయితే.. రాష్ట్రంలో ఉన్న వాస్త‌వ ప‌రిస్థితి ఏంట‌నేది ముందుగా మేథావుల‌తో ప‌రిశీలించే కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు. రాష్ట్రంలో పాల‌న‌, అభివృద్ధి, ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో ఏం చేస్తే బాగుంటుంది, ప్ర‌స్తుతం ఉన్న వాటిలో ఏమేం బాగున్నాయ‌నే దానిపైనే ప‌వ‌న్ ఎక్కువ దృష్టి పెట్టే అవ‌కాశ‌ముంది. ఏదైనా స్ప‌ష్టంగా ఓ అవ‌గాహ‌న తెచ్చుకోవాల‌నే తాప‌త్ర‌యం ప‌వ‌న్‌లో ఎక్కువ‌. త‌న‌కు తెలియ‌ని విష‌యాల‌న్నింటినీ తెలుసుకునే ప్ర‌య‌త్నం తొలుత చేస్తారు. త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌లు, అవినీతి ఆరోప‌ణ‌లు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం, కంపెనీల రాక‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ మేథావుల ఆలోచ‌న‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏంటి.. కేంద్రం నుంచి ఏం రావాలి, ఏం వ‌స్తున్నాయ‌నేవి.. కేవ‌లం అధికారులు, మంత్రులే నిర్ణ‌యించి నివేదిక‌లు త‌యారు చేసే పంథాకు చ‌ర‌మ‌గీతం పాడ‌తారు. అనుభ‌వ‌జ్ఞులైన వారిని ఒక‌చోటికి చేర్చి.. వారి స‌ల‌హాలు, సూచ‌న‌ల ప్ర‌కారం ముందుకెళ్లేందుకు ప‌వ‌న్.. తాజాగా ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ లాంటి వాటిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుగా నియ‌మించుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను పూర్తిగా మార్చేసి.. మ‌ళ్లీ కొత్త‌వి ఏర్పాటు చేసి నిధుల దుర్వినియోగం చేసే ఆలోచ‌న చేయ‌క‌పోవ‌చ్చు. ఉన్న వాటినే మ‌రింత నాణ్యంగా.. ఎలా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌నే విష‌యం దృష్టి పెడ‌తారు. లోపాల‌ను మాత్రం క‌నిపెట్టి.. అరిక‌ట్టే ఆలోచ‌న చేస్తారు.

రాష్ట్రానికి ఏమైనా త‌న‌వంతుగా చేయాలనే క‌సి, ఆలోచ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. పాల‌న ప‌రంగా అనుభ‌వం లేక‌పోవ‌డంతో.. ప‌వ‌న్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక టీంను నియ‌మించుకుని.. వారి సూచ‌న‌ల ప్ర‌కారం కొంత‌కాలం న‌డిచేందుకు ఆస్కార‌ముంది. పేదోడి క‌ష్టం చూస్తే క‌రిగిపోయే.. గుండె ప‌వ‌న్‌ది. వారి క‌ష్టాల‌ను నేరుగా త‌న‌తో చెప్పుకునే ఏర్పాటు చేస్తాన‌ని.. ఇటీవ‌ల త‌ర‌చూ వేదిక‌ల‌పై చెబుతున్నారు. అధికారంలోనికి రాగానే.. మొద‌టిగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా ఒక వ్య‌వ‌స్థ‌ను రూపొందించి.. వారి క‌ష్టం నేరుగా తెలుసుకుని వెంట‌నే ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌య‌త్నం చేయొచ్చు. క‌ష్టం ఉందంటే.. దానిని తీర్చేందుకు ఏదైనా చేయొచ్చ‌నే ఎన్టీఆర్ ధోర‌ణి ప‌వ‌న్‌లోనూ క‌నిపిస్తోంది. అందుకే.. అతి న‌ష్ట‌మా, లాభ‌మా అని చూడ‌కుండా.. పేద‌ల కోసం కొన్ని కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. అన్నింటికంటే ప్ర‌ధానంగా.. ప‌వ‌న్ త‌న మంత్రి వ‌ర్గం, ఎమ్మెల్యేల్లో ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డినా, అన్యాయాల‌కు ఒడిగ‌ట్టినా.. చాలా తీవ్రంగా వారి విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకునే ధైర్యం ఉన్న నాయ‌కుడు. అధికారుల విష‌యంలోనూ ఇంతే. అవినీతి లేని పాల‌న అందించాల‌నేది త‌న అభిమ‌త‌మ‌ని ప‌వ‌న్ అనేక‌సార్లు చెప్తున్నారు. ఎదుటి వాళ్లు త‌ప్పు చేస్తేనే ఉపేక్షించలేడు.. ఇంక త‌న‌వాళ్లు చేస్తే.. అస్స‌లు స‌హించ‌లేడు. ఒక‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటే.. మ‌ళ్లీ త‌మ పార్టీ అధికారంలోనికి వ‌స్తుందా, రాదా.. స‌మీక‌ర‌ణాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌నేది చూసుకుని ముందుకెళ్లే ర‌కం కాదు. తాను పూర్తిగా అధికారంలోనే ఉండిపోవాల‌ని రాలేదు.. పోరాటం చేయ‌డానికే వ‌చ్చా.. అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. పోరాట‌మే త‌న ప్ర‌ధాన అజెండా అని ప‌వ‌న్ కుండ‌బ‌ద్ధ‌లుగొట్టిన‌ట్టు ఎప్పుడో చెప్పేశాడు. అధికారంలోనికి వ‌చ్చినా ఈ విష‌యంలో మార్పు ఉండ‌క‌పోచ్చ‌ని.. ప‌వ‌న్ నైజం చూస్తే అర్థ‌మ‌వుతోంది.

రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్ష పార్టీల విష‌యంలో మ‌రీ దిగ‌జారుడుగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ‌రు. ఎదుటి పార్టీల్లో గెలిచిన వారిని భ‌యపెట్టో.. మ‌భ్య‌పెట్టో తెచ్చి త‌న పార్టీలో చేర్చుకునే మ‌న‌స్త‌త్వం లేదు. నీతిగా నిజాయ‌తీగా రాజకీయం చేయాల‌నే పంథా ప‌వ‌న్‌ది. ఎదుటి పార్టీల గౌర‌వాన్ని వారికి ఇస్తూనే.. త‌న పాల‌న తాను చూసుకునే ర‌కం. అందుకే.. ఒక‌వేళ ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయితే.. మాత్రం తెలుగుదేశం, వైకాపాల‌కు వ‌చ్చిన ముప్పూ ఉండ‌దు.. దాడులూ ఉండ‌వు. అంతా ప్ర‌శాంతంగానే.. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -