Monday, May 13, 2024
- Advertisement -

జమ్ముకశ్మీర్లో నాలుగో విడత ఎన్నికల సెగ..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 34 స్థానాలకు 249మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 1,910 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు చేశారు అధికారులు.

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 50 సర్పంచ్​ స్థానాలకు కూడా పోలింగ్ జరగుతోంది. 137 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్​ 28, డిసెంబర్​1, డిసెంబర్​ 4న మొదటి మూడు దశల పోలింగ్ పూర్తయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -