జనసేన ఓ కిరాయి రాజకీయ పార్టీ..!

- Advertisement -

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకాలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఫైర్ అయ్యారు. రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న పవన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిన రాష్ట్రం మాత్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగడంలేదని మండిపడ్డారు.

సినీ ఇండస్ట్రీని జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడంలేదని, వైసీపీ ప్రభుత్వం వల్ల ఇండ్రస్ట్రీ లో పని చేసే కార్మికులు దిక్కులేని వారు అవుతున్నారని తీవ్ర స్థాయిలో మందడిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చలరేగింది. పవన్ వ్యాఖ్యలకు, ఇండస్ట్రీకి ఎలాంటి సంభందంలేదని ఫిలిం ఛాంబర్ పేర్కొంది. పవన్ కళ్యాణ్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం పై జనసేనాని విమర్శలు గుప్పించడం నటుడు పోసాని మురళి కృష్ణ పవన్ పై ధ్వజమెత్తలారు. పవన్ వ్యక్తిగత విసయాలపై పోసాని విరుచుకుపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్ ప్రస్ క్లబ్ లో పవన్ పై దాడిచేసినంత పని చేశారు. పోలీసులు భారీ భద్రతతో పోసాని ఇంటికి తరలించారు.

జనసేనా పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారబోతుందని, ఇప్పుడు 151 సీట్లు సాధించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు రావచ్చని, మంత్రి పేర్నినాని రెడ్లకు పాలేరులా వహరిస్తున్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పాండవుల సభా ఎలా ఉంటుందో రుచిచూపిస్తానని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనా ఢంకా భజాయించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తాను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవాళ్లకు పాలేరని ఘాటుగానే బదులిచ్చారు. తాను జగన్ మోహన్ రెడ్డి పాలేరునేనన్న పేర్ని నాని… నివ్వు ఎవరి పాలేరువో చెప్పే దమ్ముందా అని పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు. దేశంలో కిరాయికి రాజకీయ పార్టి పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read

బరువు తగ్గాలంటే.. ఉదయం ఇలా చేయండి.

చీర.. బొట్టు.. గాజులు.. పూలు.. హాట్ హాట్ గా రష్మికా ఫస్ట్ లుక్..!

రాత్రి త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -