- Advertisement -

రాజోలిలో భారీగా పోలీసుల మోహరింపు…ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ కు రంగం సిద్ధం

- Advertisement -

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పోలీసులు భారీగా మోహరించారు. పేకాడుతున్నవారికి వత్తాసు పలకడమే కాకుండా, పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.

మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై కేవీ రామారావు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, వారిని విడిచి పెట్టాలని రాపాక వరప్రసాద్, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలాయని పోలీసులు విధులకు ఆటకం కలిగించాని కేసు నమోదు చేశారు. దీంతో రాపాకను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాపాక వరప్రసాద్ పై గతంలో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని… ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడి కేసులో ఏ-1గా రాపాక వరప్రసాద్ పేరును చేర్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -