Sunday, May 5, 2024
- Advertisement -

టీఆర్ఎస్ పాక్షిక మ్యానిఫెస్టోను విడుద‌ల చేసిన కేసీఆర్‌..

- Advertisement -

అధికారంలోకి వస్తే లక్షలోపు రుణమాఫీతో పాటు ప్రస్తుత ఫించన్లు రెట్టింపు చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎన్నికల ప్రణాళిక కమిటీ నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు సలహాలపై సమావేశంలో రెండు గంటల పాటు చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. పక్కా లెక్కలతోనే మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు.

టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

1. లక్ష రూపాయలు మళ్లీ రుణమాఫీ. 45.5లక్షల మందికి లబ్ధి. రెండు విడతలలోనే పూర్తిగా రుణమాఫీ
2. రైతు బంధు పథకం పరిహారం రూ.10వేలుకు పెంపు.
3. ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యునిట్‌. ఐకేపీ మహిళలకు నిర్వహణ బాధ్యత. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం.
4. ఆసరా పెన్షన్ డబుల్. వయో పరిమితి 65ఏళ్ల నుంచి 57కు తగ్గింపు. ఆసరా పెన్షన్ రూ. 2016, వికలాంగ పెన్షన్ రూ. 3016లు.
5. నిరుద్యోగ భృతి అమలు. నెలకు రూ. 3016 అందజేత
6. సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు.
7. రూ.2వేల కోట్లతో ధరల స్థిరీకరణ
8. పేదరెడ్డి, ఆర్యవైశ్యుల కులాలకు ప్రత్యేకకార్పోరేషన్‌లు ఏర్పాటు
9. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన
10.2లక్షల 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం
11.ఉద్యోగులకు మధ్యంతర భృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -