Sunday, May 5, 2024
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీలో నిప్పు ర‌గిల్చిన‌ కొండా సురేఖ‌..

- Advertisement -

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్తుల జాబితాలో త‌న పేరు చేర్చ‌క‌పోవ‌డంపై కొన్నాల్లుగా అసంతృప్తిగా ఉన్న కొండా సురేఖ పార్టీకీ రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూనే పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సురేఖ పార్టీలో మ‌రో బాంబు పేల్చారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

టీఆర్ఎస్‌లో తాను హరీశన్న వర్గమని.. తనలాగే ఆయనకు మద్ధతు పలికేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉలిక్కిప‌డ్డాయి. గత కొంతకాలంగా హరీశ్‌రావుకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గిపోతుండటం.. కొంగరకలాన్ బహిరంగసభలో హరీశ్‌రావును పట్టించుకోకపోవడం టీఆర్ఎస్‌లో పెద్ద చర్చకు కారణమైంది.

గ‌త‌కొంత కాలంగా కొడుకు కేటీఆర్ కోసం హ‌రీష్‌రావుకు పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గించార‌నే వార్త‌ల‌కు ఇప్పుడు బ‌లం చేకూరింది. ఇది జరిగిన కొద్దిరోజులకు సిద్ధిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపూర్‌లో జరిగిన సభలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్లయు చర్చనీయాంశమయ్యాయి.

తాను అందరి ఆదరణ, అభిమానం ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందన్నారు. ఇంతవరకు చాలని.. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా.. మీకు సేవ చేస్తానని హరీశ్ అన్నారు. దీంతో ఆయన త్వరలో రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా..? అన్న వార్త‌లు బ‌లంగా వినిపించాయి.

టికెట్ దొరకని అభ్యర్థులను పక్కకు లాగి హరీశ్ రావు తన గ్రూప్‌ను సిద్దం చేసుకుంటున్నారని..త్వరలోనే పార్టీలో చీలిక తెస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటికి కొండా సురేఖ వ్యాఖ్యలు తోడు కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -