Saturday, May 4, 2024
- Advertisement -

వైసీపీ ఎంపీల రాజీనామాల అమోదం త‌రువాయే…?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందే ఏపీలో మ‌రో సారి ఉప ఎన్నిక‌లు రానున్నాయా…? చూస్తుంటే ప‌రిస్థితులు అవున‌నే అంటున్నాయి. ప్ర‌త్యేక‌హోదాకోసం వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఐదుగురి ఎంపీల‌కు స్పీక‌ర్ కార్యాల‌యంనుంచి లేఖ అందింది.

ఈ నెల 29వ తేదీన తనను వచ్చి కలవాల్సిందిగా కోరుతూ స్పీకర్ ఆ లేఖలో పేర్కొన్నట్టుగా సమాచారం. వీరు సమర్పించిన రాజీనామా పత్రాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికే స్పీకర్ వీరిని పిలిచినట్టుగా తెలుస్తోంది. ఆ రోజున వీరితో స్పీకర్ వ్యక్తిగతంగా మాట్లాడతారని.. విడివిడిగా వీరితో సమావేశమై స్పీకర్ వీరి రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఎలాగూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలకు కట్టుబడినట్టుగా ప్రకటిస్తున్నారు కాబట్టి.. ఆమె వాటిని ఆమోదించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్‌లు రాజీనామాలు ఇచ్చిన వారిలో ఉన్నారు.

ఇప్పుడు రాజీనామాల కథ క్లైమాక్స్‌కు వచ్చిందని స్పష్టం అవుతోంది. మరో పదిరోజుల్లో ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా 11నెలల సమయం ఉంది.

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయ‌న‌డంలో సందేహంలేదు. క‌ర్నాట‌క ఎంపీల‌యిన య‌డ్యూర‌ప్ప‌, శ్రీరాముల రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదించారు. అన్నింటినీ క‌ల‌పి ఒకే సారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌చ్చు.

మ‌రో వైపు వైసీపీ ఎంపీల రాజీనామాలు పొందుతే వ‌చ్చే ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనేందుకు సీఎం చంద్ర‌బాబుకూడా సిస‌ద్ధంగా ఉన్నారు. పార్టీ నేత‌ల‌త‌ల స‌మావేశంలో ఏపీలో ఉప ఎన్నిక‌లు ఎప్పుడైనా రావ‌చ్చ‌ని వాటిని ఎదుర్కోనేందుకు పార్టీవ్రేణ‌లు సిద్ధంగా ఉండాలి పిలుపు నిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -