అంబటిపై ఫైర్ అవుతున్న జనసైనికులు !

ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీ.. గతంతో పోలిస్తే చాలా యాక్టివ్ గా ఉందనే చెప్పవచ్చు. ఒకప్పుడు పవన్ పార్ట్ టైమ్ రాజకీయాలతో జనసేన స్టాండ్ ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండదడుతూనే.. పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్. ఇప్పటికే ” జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ” , జనవాణి, గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్, వంటి కార్యక్రమాలతో ప్రజల్లో దూసుకుపోతున్నారు పవన్ కల్యాణ్. వాటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో దసరా నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న పవన్ పై వైసీపీ నేతలు విమర్శనస్త్రాలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన రీతిలో కౌంటర్ వేశారు..

ఇంతకీ పవన్ ఏమన్నాడంటే ” వైసీపీ నేతల అక్రమ పరిపాలనకు అడ్డు కట్ట వేస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గెలవనివ్వబోమని, ఎట్టి పరిస్థితీల్లో ఓట్లు చిలనివ్వబోమని ” పవన్ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ” కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారో లేదో చెప్పండి ” అంటూ రాంబాబు ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ.. జనసేన నేత పవన్ కల్యాణ్ బ్రదర్ నాగబాబు ట్విట్టర్ లో కాస్త ఘాటుగానే రీప్లే ఇచ్చారు.

” ఎన్ని సార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్య బాబు.. ఓ రాంబాబు, జంభో సర్కస్ బపూన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జనసైనికులకు లేదు.. మా అధినేతకు అంతేకంటే లేదు ” అంటూ ఎడిటింగ్ చేసిన రాంబాబు ఫోటోను పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో నాగబాబు రాసుకొచ్చారు. దీనికి కౌంటర్ గా మళ్ళీ రాంబాబు.. ” నా బొమ్మ చాలా ఓపికతో వేశారు.. మీకు పని లేనట్లుంది ” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అంతే కాకుండా ప్రశ్నించడానికి అని చెప్పి ప్రశ్నిస్తే పారిపోతున్నారు అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు అంబటి ల మద్య జరిగిన ఈ ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే అంబటి వ్యాఖ్యలపై జనసైనికులు కూడా గట్టిగానే బదులిస్తున్నారు.

Related Articles

Most Populer

Recent Posts