Saturday, May 4, 2024
- Advertisement -

కవిత అరెస్ట్..కక్ష సాధింపేనా?

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ.శుక్రవారం కవిత నివాసంలో 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మనీలాండరింగ్‌ సెక్షన్ల కింద కవితపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని తెలిపారు. అరెస్ట్ , కవితను ఢిల్లీకి తరలించడం చకచక జరిగపోగా తన నివాసం నుండి బయటకు వచ్చిన కవిత..బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం తెలిపారు.

కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని ..ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టంపై నమ్మకంతో ఎదుర్కొందామన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్టా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్‌ చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఆ మాట తప్పుతారని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కావాలనే శుక్రవారం వచ్చి అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.ఇక కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -