చిన బాబు లేఖకు సీఎం జగన్ ఏమంటారో..!

- Advertisement -

కరోనా విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. పరీక్షల వల్ల కొవిడ్‌ సోకితే ప్రమాదమని లేఖలో వివరించారు. విద్యార్థులు తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి.. ఆందోళన, ఒత్తిడి నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమమని సూచించారు.

ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని లోకేశ్‌ గుర్తు చేశారు. వారం రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3 వేల కొత్త కేసులను నమోదు అయ్యాయని.. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రజలు కోవిడ్ బారీన పడకుండా నివారించవచ్చని సూచించారు.

- Advertisement -

మోత్కుపల్లి ఆరోగ్యం సీరియస్.. రాష్ట్రం కుడా సీరియస్..!

అంతా అబద్ధం.. నేను చెప్పింది నమ్మండి అంటున్న ఈటల..!

120 కూల్చివేశారు.. ఎక్కడో తెలుసా.. చిన బాబు చెప్పారు..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -