Saturday, May 4, 2024
- Advertisement -

శాసనమండలి సంతాపం.. నోముల నువ్వు గుండెలలో నిలిచావు..!

- Advertisement -

శాసనమండలి నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సభ్యులు లేచి నిలబడి మౌనం పాటించారు. అనంతరం నోముల చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్ట్​ పార్టీలో ఎన్నో పోరాటాలు చేశారని సభ్యులు కొనియాడారు.

1956 జనవరి 9న నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో జన్మించారు. నోముల నర్సింహయ్య… విద్యార్థి దశ నుంచే సంఘాల్లో పనిచేసి నాయకత్వ లక్షణాల్ని ప్రోది చేసుకున్నారు. 1973లో ఎస్​ఎస్​సీ, 73 నుంచి 75 వరకు ఇంటర్, 75 నుంచి 78 వరకు డిగ్రీ (బీఏ) చివరి సంవత్సరంలో ఉండగానే సీపీఎం సభ్యత్వం పొందిన నోముల… అప్పట్నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే వచ్చారు.

1978లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్​ఎస్​యూలో చేరి… కొండపల్లి సీతారామయ్య వద్ద కొద్దిరోజులు అనుచరుడిగా పనిచేశారు. ముసుగు వెంకటనర్సింహారెడ్డి అనే వ్యక్తి ద్వారా నోముల… ఆర్​ఎస్​యూ నుంచి బయటపడి సీపీఎంలో చేరారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున!

అనుమానాస్పద స్థితిలో ఎంపీ మృతి.. పోస్ట్​మార్టం రిపోర్ట్ తరువాత నిజాలు..!

మళ్ళీ ఇక్కడ మహమ్మారి విజృంభణ.. టార్గెట్ హైదరబాద్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -