Friday, April 19, 2024
- Advertisement -

సీఎం జగన్ ను మెచ్చుకుంటున్న కేంద్రం ?

- Advertisement -

అన్ లాక్ 2.0 గురించి అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ లాక్ 1.౦ ఇప్పటికే పూర్తికాగా అన్ లాక్ 2.0 దీనికి సంబంధించి మొన్న ఒక్కటో తారీఖు నుంచే అమలైంది. ఈ నిబంధనలు ఈనెలాఖరు వరకు కొనసాగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో అన్ లాక్ 2.0 అమలు లోకి వచ్చింది. కంటెన్ మెంట్ జోన్లతో జూలై 31 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. కంటెన్ మెంట్ జోన్లో అత్యవసర నిత్యవసర సేవలు మినహా ఇతర అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించారు. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పై నిషేధం కొనసాగుతోంది. మెట్రో రైలు, సినిమా హాల్లు, జిమ్‍లు, స్విమ్మింగ్ ఫూల్స్, సమావేశ మందిరాలు, వినోద పార్కులపైన నిషేధం కొనసాగుతోంది.

రాజకీయ ఆధ్యాత్మిక సభలు సమావేశాలు పైన కూడా నిషేధం కొనసాగుతోంది. మరోవైపు వివిధ రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కంటెన్ మెంట్ జోన్ ల వెలుపల అంక్షలు విందించే స్వేచ్చ ఇచ్చింది కేంద్రం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ సంస్థలు జూలై 15 నుంచి ప్రారంభం అవుతాయి. దేశీయ విమాన సర్వీసులు రైలు సర్వీసులులకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా బాధితుల సంఖ్య మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసు నమోదు అవుతాయి.

అన్ లాక్ 2.0 సడలింపు అనంతరం కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజల్లో కొంత మంది మాస్కులు ధరించకపోవడం.. భౌతిక దూరం విషయంలో నిర్లక్ష్యం వల్లే ఎక్కువ సంఖ్యలో కేసు నమోదు అవుతాయి. ఏపీ తో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసు సంఖ్య అధికంగా ఉంది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్లే ఏపీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం జగన్ రాష్ట్రంలో వైరస్ విజృంభించిన తొలినాళ్ళ నుంచే అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వాహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల టెస్టులు చేశారు. ఏపీలో 10 లక్షలు టెస్టులు చేయడం వల్ల కరోనా సోకిన వారు త్వరగా గుర్తించడం జరిగింది.

అందువల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో జగన్ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. రాష్ట్రం చేసినటువంటి పరీక్షల పరంగా చూస్తే కరోనా పాజిటివ్ రేటు కేవలం 1.77 ఉంది. అయితే తెలంగాణలో మాత్రం 20 శాతం ఉంది. ఏపీలో ఒక్క రోజులో 765 కేసులు నమోదయిన కూడా తెలంగాణలో 1850 కేసులు నమోదు కూడా జనం కాస్త రిలాక్స్ గా ఉండటానికి కారణం ఏపీలో చేస్తున్నటువంటి ఎక్కువ కేసులే. తెలంగాణలో ఏపీకి రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు ఉండడం ఏపీలో తక్కువగా కేసులు ఉండటంతో అన్ లాక్ 2.0లో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఇదంతా సాధ్యమైనట్లు కేంద్రం మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఏంటి కరోనాను కట్టడి చేయడంలో ప్రపంచవ్యాప్తంగా జగన్ ను మెచ్చుకుంటున్నారు.

జగన్ నుంచి రోజా , విడదల రజిని లకు గుడ్ న్యూస్ ?

కొల్లు రవీంద్రను అరెస్ట్ పై స్పందించిన కొడాలి నాని

జగన్ ని అభినందించిన పవన్..!

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -