Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న మోదీ..అధికారంలోకి వ‌స్తారా..?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ కొద్దీ భాజాపాను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. మ‌రో సారి అధికారంలోకి వ‌చ్చేందుకు మోదీ, అమీత్‌షా ద్వ‌యం ..ప్ర‌జ‌ల‌కు తాయిలాలు వ‌డ్డంచేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌ధానంగా రైతుల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌ధ‌కాల‌ను సిద్దం చేస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అధికారంలోకి రావాలంటే అన్ని పార్టీల‌కు రైతుల రుణ‌మాఫీనే ప్ర‌ధానం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే దేశ వ్యాప్తంగా రైతు రుణాల‌ను వాఫీ చేస్తామ‌ని ఆ పార్టీ ధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. దీంతో భాజాపా కూడా రైతుల అదే దిశ‌గా వెల్తోంది.

రైతుల‌ను త‌మ వైపు మ‌లుచుకొనేందుకు తెలంగాణా సీఎం కేసీఆర్‌ను మోదీ పాలో అవుతున్నారు. రైతుల‌ను ఆదుకొనేందుకు కేసీఆర్ రైతు బంధు ప‌ధ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. ఈ ప‌ధ‌కం స‌క్సెస్ అవ‌డంతో ముంద‌స్తుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో మ‌రో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పడు ఇదే ప‌ధ‌కాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేసి రెండో సారి అధికారంలోకి రావాల‌ని మోదీ ప్లాన్ వేస్తున్నారు.

దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఈ ప‌ధ‌కంపై పార్టీలో వివిధ ద‌శ‌ల్లో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. రైతుల‌కు నేరుగా ఖాతాల్లో నిధులు జ‌మ చేయ‌డం వ‌ల్ల ఎరువులు, విత్త‌నాలు కొనుక్కొనేందుకు వెసులుబాటు ఉంటుంద‌ని కేంద్రం భావిస్తోంది.

ఇటీవ‌లే 5 రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భాజాపా ఘోరంగా ఓట‌మిని చ‌విచూసింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎన్డీఏపై ప్ర‌జ‌ల్లో తీవ్ర మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌ధ్యంలో ఈ ర‌క‌మైన తాయిళాల‌ను ప్ర‌క‌టించి వారి ఆగ్ర‌హం చ‌ల్లార్చాల‌ని చూస్తోంది. దీని కోసం రూ.1.25 ల‌క్ష‌కోట్లు అవ‌స‌రం అవుతుంద‌ని కేంద్రం అంచ‌నా వేస్తోంది.

అయితే ఈ ప‌ధ‌కాన్ని కేంద్రం, రాష్ట్రాలు క‌ల‌సి అమ‌లు చేసే విధంగా విధివిధానాల‌ను రూపొందిస్తోంది. కేంద్రం 70 శాతం, రాష్ట్రం 30 శాతం భ‌రించేలా ప్ర‌ణాలిక‌లను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి రాధామోహ‌న్ సింగ్‌, అమీత్‌షా, మోదీ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. రైతుల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఓ నివేదిక‌ను రూపొందించి మోదీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజాపాకు విజ‌యం అంత సుల‌భంగా ద‌క్కేట‌ట్లు క‌నిపించ‌డంలేదు. ఎందుకంటే ఎన్డీఏ ప్ర‌భుత్వంపై రైతులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. పార్ల‌మెంటు స‌మావేశాలు ముగిసేలోపు రైతుల సంక్షేమానికి ప‌ధ‌కాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే ఈ ప‌ధ‌కాలు రుణ‌మాఫీకీ మించి ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ప‌ధ‌కాలు కేసీఆర్‌లాగా భాజాపా రెండో సారి అధికారంలోకి తీసువ‌స్తాయా అన్న‌ది వేచి చూడాల్సిందే…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -