Saturday, May 11, 2024
- Advertisement -

నేను సైతం జ‌న‌సేన‌లోకి

- Advertisement -
  • ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న ప్ర‌కాశ్‌రాజ్‌
  • ఇటీవ‌ల ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌. తన విలక్షన నటనాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ప్ర‌కాశ్‌రాజ్ ఇటీవ‌ల సామాజిక అంశాల‌పై స్పందిస్తున్నాడు. నటనకు ప‌రిమితం కాకుండా సామాజిక సేవ కూడా చేస్తానంటున్నాడు. న‌టుడు ప్ర‌జా మ‌నిషి న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తాల‌ని చెబుతున్న ప్ర‌కాశ్ రాజ్ త్వ‌ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌లో వెళ్తాడ‌ని టాక్‌?

జనసేనకి సినీనటుల మద్దతు ప‌లుకుతున్న వారిలో ఇత‌డు కూడా చేరిపోతున్నాడు. ఆలీ, శివబాలాజీ, శివాజీ, నాగబాబు, సంపూర్ణేశ్‌బాబు త‌దిత‌రులు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రాజ‌కీయంగా అండ‌గా నిల‌బ‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ప‌వ‌న్ ఆశ‌యాలు గొప్ప‌వ‌ని, ప‌వ‌న్ పార్టీ విధానాలు న‌చ్చితే పార్టీలో ప‌నిచేయ‌డానికి తాను సిద్ధం అని ప్ర‌క‌టించారు.
`ఇది ప్రజాస్వామ్య పాలన తప్పు ఎవరు చేసినా అడిగే హక్కు అంద‌రికీ ఉంది. దానిని ఎవరు ఉపయోగించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. త‌న సన్నిహితుడు, ఆప్తుడు కమల్‌హాసన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. త‌న‌కు రాజకీయాలు అంటే పెద్దగా ఆసక్తి లేదని..కానీ ఆ పార్టీ గురించి..పార్టీ విధానాల గురించి కమల్ త‌న‌తో చర్చించలేదు అని చెప్పాడు. కమల్ పార్టీలో నేను చేరను అని స్ప‌ష్టం చేశారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ గురించి మాట్లాడుతూ .. పవన్ పార్టీ గురించి నేను తెలుసుకున్నాను. తానూ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో బాగున్నాయి.. తన వాళ్ల‌ ప్రజలకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు అనేది తన గట్టి నమ్మకం” అని చెప్తున్నాడు. పవన్ గురించి అంతా తెలుసు ఆయన ఆశయాలు చాలా గొప్పవని చెప్పుకొచ్చాడు. పవన్ పార్టీ విధానాలు నచ్చితే నేను ఆయనతో పాటు ఆ పార్టీలో కలిసి నడవడానికి సిద్దం అని చెప్పుకొచ్చారు.. తన మద్దతు ఎప్పుడు పవన్‌కు ఉంటుంది అని చెప్పారు ప్రకాశ్‌రాజ్. వీట‌న్నిటీ నేప‌థ్యంలో ప్ర‌కాశ్ జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -