Tuesday, May 14, 2024
- Advertisement -

పీకే చెప్పిన సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్

- Advertisement -

వైసీపీ అధినేత ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. 2018లోనె ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని అందుకు పార్టీ శ్రేణులంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల స‌న్నాహ‌కాల్లో భాగంగానె ఆరు నెల‌ల పాటు అన్న వ‌స్తున్నాడు పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. అనంత‌పురంలో యువ‌భేరి కార్య‌క్ర‌మం స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్ ఖుషీగా ఉన్నారు.

రాష్ట్రంలో అధికార టీడీపీ బ‌లంగా ఉంది. ఆ పార్టీని దెబ్బ‌కొట్టే పార్టీ ఏదైనా ఉందంటె అది వైసీపీకె సాధ్య‌మ‌నె చెప్ప‌వ‌చ్చు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌ధ‌నే ధీమాతో టీడీపీ ఉంది. తాము చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలె గెలిపిస్తాయ‌ని బాబు ధీమాగా ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి రావ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతోంది. గెలుపుకోసం ఉన్న దారుల‌న్ని అమ‌లు చేస్తోంది. గెలిచిన వాల్లు గోడ దూకడం, అర్థికంగా బ‌ట‌మైన వాల్లు లేకపోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతోంది. ఈ సారి అధికారంలోకి రాక‌పోతె పార్టీ భ‌విష్య‌త్తు క‌ష్ట‌మె.

వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కూడా పార్టీ గెలుపుకోసం కృషిచేస్తున్నారు. బ‌ల‌మైన టీడీపీని దెబ్బ‌కొట్ట‌డం సాధ్యం కాద‌ని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. బీజేపీ లేదా జనసేనలతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీని కాస్తోకూస్తో దెబ్బకొట్టగలమని పీకే చెప్పిన సూచనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

టీడీపీ – బీజేపీ అంటీముట్టనట్టు ఉంటున్నా టీడీపీని వదిలి బీజేపీ బయటకు వచ్చే అవకాశాల్లేవని వైసీపీ అంచనా వేస్తోంది. భాజాపాను న‌మ్ముకోవ‌డంకంటె జ‌న‌సేన ప‌వ‌న్‌ను న‌మ్ముకోవ‌డం మంచిద‌నె చెప్పిన‌ట్లు తెలుస్తోంది. పవన్ ను మచ్చిక చేసుకోవాలంటే తమ దగ్గరున్న ఏకైక అస్త్రం ప్రత్యేక హోదా. స్పెషల్ స్టేటస్ కోసం పవన్ పోరుబాట పట్టారు. పార్టీలు వేర‌యినా ఇద్ద‌రు నేత‌లు ప్ర‌త్యేక‌హోదా కాబ‌ట్టి ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశాలు లేకోలేద‌నె వాద‌న‌లు వినిపిస్తున్నాయి. చూడాలి భవిష్య‌త్తులో పొత్తు రాజ‌కీయాలు ఎలా ఉంటాయో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -